రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రణాళికా విభాగాన్ని పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలన్న ధ్యేయానికి అనుగుణంగా అవసరమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో పనిచేస్తున్న ప్రణాళికా విభాగం అధికారులను ఇతర మున్సిపాలిటీలకు బదిలీ చేసింది. వివిధ స్థాయిల్లో ఉన్న 14 మంది ప్రణాళికా విభాగం అధికారులను డిప్యుటేషన్‌పై 14 ప్రాంతాలకు బదిలీ చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చూడండి: అసెంబ్లీలో నమస్కారం 'కరో'నా అంటున్న నేతలు