ETV Bharat / state

Four Injured Due To Current Shock Quthbullapur : కేటీఆర్​కు స్వాగత ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్​ షాక్.. నలుగురికి గాయాలు - Four Injured Due To Electric Shock Jeedimetla

Four Injured Due To Current Shock Quthbullapur : రెండో విడత డబుల్ బెడ్​ రూం ఇళ్ల పంపిణీ కోసం కుత్బుల్లాపూర్​లో గురువారం రోజున మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు స్వాగత ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ తగిలి నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

Four Persons Injured By  Electric Shock In Quthbullapur

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 20, 2023, 2:21 PM IST

Four Injured Due To Current Shock Quthbullapur : సీఎం మెదక్ టూర్ నేపథ్యంలో కుత్బుల్లాపూర్, సూరారంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీ కడుతున్న సమయంలో ఓ వ్యక్తి మరణించిన ఘటన జరిగి నెల రోజులు కాకముందే మరో ఘటన వెలుగు చూసింది. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్ బస్టాప్ సమీపంలో కరెంట్ షాక్ తగిలి నలుగురు యువకులకు గాయాలయ్యాయి.

రెండో విడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ కోసం గురువారం రోజున మంత్రి కేటీఆర్ కుత్బుల్లాపూర్​లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభానికి కేటీఆర్​ స్వాగత ఫ్లెక్సీలు కడుతుండగా ఇవాళ ఉదయం 5 గంటల సమయంలో కరెంట్ వైర్ తగిలి విద్యుదాఘాతం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

Four Injured Due To Electric Shock Jeedimetla : గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారని గ్రామస్థులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లారు. ఘటనపై ఆరా తీసి కేసు నమోదు చేసుకున్నారు. గాయపడిన యువకులు విఠల్ (19), దుర్గేష్ (19), బాలరాజు (18), నాగనాథ్ (33).. నాగ్ నాథ్ (33)గా పోలీసులు గుర్తించారు. వీరిలో నాగ్​నాథ్​కు తీవ్ర గాయాలయ్యాయని.. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

Viral Video of Young Man Died Due to Electric Shock : పైపులను క్రేన్​ హుక్కుకు తగిలిస్తుండగా కరెంట్ షాక్.. వీడియో వైరల్

వీరంతా మెహిదీపట్నం తాళగడ్డలో నివసిస్తారని.. ఇలా ఫ్లెక్సీలు కడితే రూ.1000 ఇస్తారనే ఆశతో వచ్చారని బాధితుల బంధువులు తెలిపారు. కానీ ఇలా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడతారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారికేమైనా అయితే తమ కుటుంబాలు వీధిన పడతాయని బాధితుల కుటుంబ సభ్యులు వాపోయారు. వారికి మెరుగైన వైద్యం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Four Injured Due To Electric Shock Hyderabad : "రేపు మా నియోజకవర్గానికి రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ కోసం మంత్రి కేటీఆర్ వస్తున్నారు. ఇందుకోసం మేమంతా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ క్రమంలోనే మెహిదీపట్నం నుంచి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు కొంతమంది యువకులను పిలిచాం. వారు మా నియోజకవర్గంలో కేటీఆర్​కు స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ స్తంభానికి ఫ్లెక్సీ కట్టడానికి వెళ్లారు. ఆ సమయంలో ఓ కరెంట్ వైరు తగలడంతో విద్యుత్ షాక్ వచ్చింది. మొదట ఒకరికి వచ్చిన షాక్ క్షణాల్లో మిగతా ముగ్గురికి కూడా వ్యాపించింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారికి కరెంట్ షాక్ రావడం చూసి పక్కనే ఉన్న కర్రతో గట్టిగా కొట్టాం. వెంటనే వాళ్లు కిందపడ్డారు. వాళ్లను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకువచ్చాం." అని గ్రామస్థులు తెలిపారు.

New Groom Died Electric Shock in Siddipet : పెళ్లింట విషాదం.. కరెంట్​ షాక్​తో నవ వరుడు మృతి

Double Bedroom Houses Distribution in Hyderabad : జాతరగా ఇళ్ల పంపిణీ.. కల నెరవేరిన వేళ లబ్ధిదారుల ఆనందం 'డబుల్'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.