ఇవీ చూడండి:కోదండరాం మద్దతు కోరిన రేవంత్
రైతన్నకు 'రుణాల' భారం - canara bank
రుణాలు మంజూరులో కెనరా బ్యాంకు అక్రమాలకు పాల్పడిందంటూ రైతులు ఆందోళనకు దిగారు. తెజస అధ్యక్షుడు కోదండరాం, మహిళా సంఘాల నేతలు మద్దతు పలికారు.
ఆందోళన చేస్తున్న రైతులు
హైదర్‌గూడలోని కెనరా బ్యాంకు రుణాలు ఇవ్వడంలో మోసాలకు పాల్పడిందని రైతులు ధర్నాకు దిగారు. పాలిహౌజ్నిర్మాణం కోసం రైతులకు కేంద్ర పభుత్వం 50% రాయితీ ఇస్తుంది. రుణం కోసం దాఖలు చేసుకున్న రైతులకు మంజూరైన, ఆ సొమ్ము వేరే వ్యక్తుల ఖాతాల్లో బ్యాంకు అధికారులు జమ చేశారని ఆరోపించారు. వీరి అక్రమాలపై రిజర్వు బ్యాంకు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు తెజస అధ్యక్షుడు కోదండరాం మద్దతు పలికారు.
ఇవీ చూడండి:కోదండరాం మద్దతు కోరిన రేవంత్