ETV Bharat / state

దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంది: చిదంబరం

ఏఐసీసీ నేతృత్వంలో హైదరాబాద్​లోని ముఫకంజా కళాశాలలో కేంద్ర బడ్జెట్, దేశ ఆర్థిక వ్యవస్థపై సెమినార్ నిర్వహించారు. ఈ సదస్సుకు కేంద్ర మాజీమంత్రి పి. చిదంబరం, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి హాజరయ్యారు.

former union minister chidambaram on budget
దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంది: చిదంబరం
author img

By

Published : Feb 8, 2020, 2:06 PM IST

Updated : Feb 8, 2020, 3:21 PM IST

దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంది: చిదంబరం

దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని కేంద్ర మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యమే స్వయంగా వెల్లడించారని ఆయన పేర్కొన్నారు. ఐసీయూలో ఉన్న రోగిని గుర్తించి వైద్యులు కనీసం చికిత్స అందించే ప్రయత్నం చేయకుండా..మంచిరోజులు రాబోతున్నాయని అంటున్నారని ఎద్దేవా చేశారు. బంజారాహిల్స్​లోని ముఫకంజా కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ పరిశోధన విభాగం ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ 2020-21 దేశ ఆర్థిక వ్యవస్థపై జరిగిన సదస్సులో చిదంబరం పాల్గొని అనంతరం ఆర్థిక పరిస్థితులపై పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

ఆర్థికాభివృద్ధి 8.5శాతం నుంచి 5శాతానికి దిగజారిపోయిందన్నారు. ఆహార, వ్యవసాయ రంగాలకు బడ్జెట్​లో కోత విధించారని.. ఇది గ్రామీణాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. 70శాతం ఉత్పత్తులు చేసే దేశంలో పెట్టుబడులు నిలిచిపోయాని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు రావడంలేదన్నారు. దేశ వ్యాప్తంగా అనేక చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. ఆటోమొబైల్ రంగం కుదేలైపోయిందన్నారు.

ఇవీ చూడండి: గిరిజనుల వద్ద ఆస్తులు లేకున్నా ఆనందముంది: అర్జున్‌ ముండా

Last Updated : Feb 8, 2020, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.