NITJAA Hyderabad Chapter Meet: అరవై వసంతాల మధుర జ్ఞాపకాలు విరబూశాయి. అప్యాయంగా అందరినీ పలకరించుకున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అందరూ ఒక్కటై కలిసిపోయారు. జంషెడ్‌పూర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థులు హైదరాబాద్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జంషెడ్‌పూర్ నిట్‌లో 1960 నుంచి 2021వరకు చదివిన సుమారు 150 మంది పూర్వ విద్యార్థులు ఎన్ఐటీజెఏఏ హైదరాబాద్ చాప్టర్‌గా ఏర్పాటయ్యారు. వీరంతా బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కుకు ఎదురుగా ఉన్న జింఖానా క్లబ్‌లో జంషెడ్‌పూర్ అలుమినీ మీట్ పేరుతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు.
అలనాటి మధుర క్షణాలను.. చిలిపి చేష్టలను అందరూ గుర్తుకు తెచ్చుకుని ముచ్చటపడ్డారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అంతా కలిసి కోలాహలంగా సంతోషంగా గడిపారు. ఈ సమ్మేళనంలో సీనియర్లను జూనియర్లు సన్మానించారు. వీరంతా కొంత నిధిని సమకూర్చి కళాశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించుకున్నారు. ప్రతి ఏడాది ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించారు. కాలేజి రీసెర్చ్ కోసం విద్యార్థులు తమ అభిప్రాయాలను తెలిపేందుకు ఒక ప్రత్యేక ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కొణిజేటి బాబ్లా, సుబ్బారావు, శ్రీకాంత్, రాజా తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:
Machareddy Accident Today : కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురు మృతి
komuravelli mallanna jathara: భక్తుల అగ్నిగుండ ప్రవేశం.. ముగిసిన మల్లన్న బ్రహ్మోత్సవాలు
Traffic Pending Challans: మరో 3 రోజులే ఈ ఆఫర్.. త్వరపడండి
కాళేశ్వరం ప్రాజెక్టు ఎనిమిదో ప్యాకేజీ కాలువ మట్టి అక్రమంగా తరలింపు