పద్మశాలి కులస్థులందరూ ఆర్థికంగా బలోపేతం కావాలని రాజ్యసభ మాజీ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. తమ హక్కులను సాధించుకోవడానికి సంఘటితం కావాలని కోరారు. అఖిల భారత పద్మశాలి ఇంజినీర్స్ విభాగం రూపొందించిన నూతన క్యాలెండర్, డైరీని హైదరాబాద్లోని పద్మశాలి భవన్లో ఆవిష్కరించారు.
పద్మశాలీలు రాజ్యాధికార నిర్ణేతలుగా అవతరించాలని ఆనంద భాస్కర్ కోరారు. ఇంజినీర్స్ విభాగం జాతీయ అధ్యక్షుడు పుట్ట పాండు రంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో... అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీధర్ సుంకుర్వార్, రాష్ట్ర అధ్యక్షుడు మ్యాడం బాబూరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు వనం దుశ్యంతల తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పల్లా రాజేశ్వర్రెడ్డి మళ్లీ ఓట్లడిగే హక్కు లేదు : ఉత్తమ్