Ponnala Comments on Vande Bharat Train : సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేది కాదని.. కేవలం ధనికులకు ఉపయోగపడేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. పండుగపూట రాజకీయాలు మాట్లాడకూడదనుకున్నానని కానీ.. మాట్లాడక తప్పడం లేదన్నారు. సాక్షాత్తు దేశ ప్రధాని, ఇద్దరు కేంద్రమంత్రులు, గవర్నర్ అందరూ ఒక రైలుకు విస్తృత ప్రచారం చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
వందే భారత్ రైలును సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు కొనసాగింపుగా ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారని పొన్నాల పేర్కొన్నారు. ఇది మొదటి రైలు కాదని, ఇప్పటి వరకు రోజు.. వారాంతాల్లో నడిచేవి 17 రైళ్లు ఉన్నాయని, ఇది 18వది అని విమర్శించారు. ప్రజోపయోగ కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా కొత్త పేర్లు, కొత్త నినాదాలు, ప్రచారాలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఆరోపించారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పార్లమెంట్ సాక్షిగా చేసిన విభజన చట్టంలోని అంశాలు 8 ఏళ్లలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా అని పొన్నాల లక్ష్మయ్య నిలదీశారు.
"దేశంలో ఇది మొదటి రైలు కాదు. ఇప్పటి వరకు రోజు.. వారాంతాల్లో నడిచేవి 17 వందేభారత్ రైళ్లు ఉన్నాయి. ఇది 18వ రైలు. ప్రజోపయోగ కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా కొత్త పేర్లు, కొత్త నినాదాలు, ప్రచారాలు, ప్రారంభోత్సవాలను మోదీ చేస్తున్నారు. విభజన చట్టంలోని అంశాలు 8 ఏళ్లలో ఒక్కటైనా నెరవేర్చారా".- పొన్నాల లక్ష్మయ్య, మాజీ పీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి: