స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కరోనా యోధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రతీ ఏడాది స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకుంటామని.. ఈ ఏడాది మాత్రం కొవిడ్‌పై పోరాడుతున్న వారిని గుర్తు చేసుకోవాలని సూచించారు.
కొవిడ్ దృష్ట్యా వంటింటి నుంచి వాఘా సరిహద్దు వరకు.. కరోనాపై పోరాటం జరుగుతోందని కవిత పేర్కొన్నారు. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు ముందు వరుసలో నిలబడి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కరోనా పరిస్థితుల్లో ప్రజల్లో మంచి గుణాలు, ప్రాచీన పద్ధతులు పెల్లుబికాయని అన్నారు.