ETV Bharat / state

'ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కాలరాసేందుకు కుట్ర'

హైదరాబాద్​ రాజ్​భవన్​లో గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ను గిరిజన రిజర్వేషన్​ సమితి నాయకులు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్​ కలిసి వినతిపత్రం అందించారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లును కాపాడాలని గవర్నర్​కు విన్నవించారు.

Former MLC Ramulu Naik Meet the Governor Tmil sai Soundararajan
'ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కాలరాసేందుకు కుట్ర'
author img

By

Published : Jun 1, 2020, 10:21 PM IST

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కాలరాసేందుకు కుట్ర జరుగుతోందని, ఈ విషయంలో గవర్నర్, రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కోరారు. గిరిజన రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో రాజ్ భవన్​లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ను కలిసి జీఓ ఎంస్ నంబర్ మూడు విషయమై వినతిపత్రం అందించారు.

రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లను ఆరు నుంచి 12 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చి... ఆరేండ్లు అయినా పెంచలేదని అన్నారు. తక్షణమే జోక్యం చేసుకొని గిరిజనుల రిజర్వేషన్లు కాపాడాలని గవర్నర్​ను కోరినట్లు రాములు నాయక్ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.