రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు చెందిన రూ.1000 కోట్ల నిధులను మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వంపై సమగ్ర విచారణ చేయించాలని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. కరోనా నేపథ్యంలో కేంద్రం వెసులుబాటు ఇస్తూ 29 రాష్ట్రాలకు గైడ్ లైన్స్ జారీ చేసిందని.. ఆ రాష్ట్రాలు భవన నిర్మాణ కార్మికుల బోర్డు సంక్షేమ నిధి నుంచి డబ్బులు తీసుకుందని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
సంక్షేమ నిధులు కార్మికులకే అందాలి..
రాష్ట్ర ప్రభుత్వం వేయ్యి కోట్ల రూపాయలు డ్రా చేసిందని.. కార్మికులకు ఒక్క రూపాయి ఇవ్వకుండా పౌర సరఫరాల శాఖకు ఏకపక్షంగా బదిలీ చేసిందన్నారు. సుప్రీం ఆదేశాల ప్రకారం ఆ డబ్బులు కార్మికులకే చెందాలన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో బోర్డు విభజన కాకుండా ప్రభుత్వం ఎలా డ్రా చేసుకుంటుందని రాములు ప్రశ్నించారు. తక్షణమే ఆ నిధులను కార్మికులకు అందేలా చర్యలు తీసుకోవాలని కమిషన్కు విజ్ఞప్తి చేశారు. కేసు తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేసిందని రాములు నాయక్ వెల్లడించారు.