కేంద్ర ఆర్థిక బడ్జెట్ తప్పుల తడకగా ఉందని... ఆర్థిక అభివృద్ధి ఆదాయ విషయంలో బోగస్ లెక్కలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్సీ, ఆచార్య నాగేశ్వర్ అన్నారు. ఆర్థిక సవాళ్లను ఏవిధంగా ఎదుర్కొంటారో బడ్జెట్లో ప్రస్థావన లేదని హిమాయత్ నగర్‌లోని సీపీఐ కార్యాలయంలో జరిగిన బడ్జెట్ విశ్లేషణ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఆదాయ, వ్యయాలకు పొంతన లేదని... పెట్టుబడుల ఉపసంహరణ ప్రమాదకరగా ఉందని వెల్లడించారు.
ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేయడం తగదని... కార్పొరేట్ శక్తులు, ధనవంతులకు, పెట్టుబడిదారులకు ఈ బడ్జెట్ మేలు చేసే విధంగా ఉందే తప్ప ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేదని విమర్శించారు. మోస పూరిత బడ్జెట్‌పై ప్రజలను చైతన్యపరిచేందుకు వామపక్ష పార్టీలు ముందుకు రావాలని నాగేశ్వర్ కోరారు. కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రంతో పాటు పలువురు వామపక్ష నాయకులు పాల్గొన్నారు.