కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బి.కృష్ణ అనారోగ్యంతో మృతిచెందారు. సోమవారం ఉదయం ఆయనకు గుండెపోటు రాగా... హైదరాబాద్ నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలించే మార్గమధ్యంలోనే మృతిచెందినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి హయాంలో ఆసిఫ్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, పార్లమెంటరీ సెక్రటరీగా ఆయన పనిచేశారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాల్లో పాల్గొన్నారని కుటుంబసభ్యులు వెల్లడించారు.
కృష్ణ మృతికి హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెరాస పార్లమెంట్ సభ్యులు కె.కేశవరావు, కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు ప్రగాఢ సంతాపం తెలిపారు. నియోజకవర్గంలో నిరంతరం ఎస్సీ, ఎస్టీల కోసం కృషి చేసినట్లు నేతలు పేర్కొన్నారు. పురానాపూల్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.
ఇదీ చూడండి: తెలంగాణలో కొత్తగా 1,473 కరోనా కేసులు.. 8 మంది మృతి