ఈఎస్‌ఐ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టి కోర్టు... విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకే తనపై కేసులు నమోదు చేశారని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు తనను 3రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించారని తెలిపారు. తన కుటుంబంపై ఉన్న కక్షతోనే ఈ కేసు నమోదు చేశారని ఆయన పిటిషన్‌లో వివరించారు.