ETV Bharat / state

భాజపాకు రాజీనామా చేసిన శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ - తెరాసలో చేరనున్న స్వామిగౌడ్

swamy goud
swamy goud
author img

By

Published : Oct 21, 2022, 3:19 PM IST

Updated : Oct 21, 2022, 4:18 PM IST

15:17 October 21

భాజపాకు రాజీనామా చేసిన శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్

బండి సంజయ్‌కు రాజీనామా లేఖ పంపిన స్వామిగౌడ్

Swamy goud resigned to Bjp: ఒకే రోజు ఇద్దరు బీసీ నేతలు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. భాజపాలో పరిణామాలు సంతృప్తికరంగా లేవంటూ... స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌ కమలంగూటిని వీడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో భాజపా విఫలమైందని స్వామిగౌడ్‌ ఆరోపించారు. ధనవంతులు, కాంట్రాక్టర్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ఇద్దరు తమ రాజీనామా లేఖలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపారు.

‘ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తామని చెప్పి మునుగోడు ఉప ఎన్నికలో భాజపా వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉంది. పార్టీ తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. సామాజిక బాధ్యత లేకుండా ఎన్నికలు అనగానే డబ్బు సంచులు గుప్పించాలన్నట్లుగా బడా కాంట్రాక్టర్లే రాజ్యాలేలాలి.. పెట్టుబడి రాజకీయాలు చేయాలన్నట్లు కొనసాగిస్తున్న వైఖరి.. నాలాంటి బలహీన వర్గాలకు చెందిన నాయకులకు స్థానం ఉండదని తేటతెల్లమైంది. అనేక ఆశయాలతో నేను భాజపాలో చేరినప్పటికీ దశాదిశ లేని నాయకత్వ ధోరణులు.. నిర్మాణాత్మక రాజకీయాలకు, తెలంగాణ సమాజానికి ఏమాత్రం ఉపయోగకరంగా లేవని అనతికాలంలోనే అర్థమైంది. ప్రజాహితమైన పథకాలు, నిబద్ధత కలిగిన రాజకీయ సిద్ధాంతాలతో ప్రజలను మెప్పించడం కంటే మందు, మాంసం, విచ్చలవిడిగా నోట్ల కట్టలు పంచడం ద్వారా మునుగోడు ఉప ఎన్నికలో గెలవాలనుకుంటున్న తీరు పట్ల నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను' అని శ్రవణ్‌ పేర్కొన్నారు.

ఈ ఏడాది ఆగస్టులో శ్రవణ్‌ కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరారు. బానిస బతుకు బతకడం ఇష్టంలేకే కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు అప్పట్లో ఆయన పేర్కొన్నారు. రాజీనామా సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం దిల్లీ వెళ్లి భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఆ పార్టీకీ రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సమక్షంలో దాసోజు శ్రవణ్‌, స్వామిగౌడ్ గులాబీ కండువా కప్పుకోనున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 21, 2022, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.