ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ 25వ వార్షికోత్సవానికి మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రికెట్ , వైద్యానికి సంబంధించిన పలు అంశాలపై సచిన్ స్పందించారు. ఏఐజీ ప్రజలకు అత్యంత నిబద్ధతతో సేవ చేస్తోందన్న ఆయన... అత్యాధునిక పరికరాల వినియోగంతోపాటు... రోగులను అర్థం చేసుకుని వారికి ప్రేమ పూర్వకంగా ఇచ్చే వైద్యం వల్ల ఎంతో మంది త్వరగా కోలుకుంటున్నారని కితాబులిచ్చారు. ఆధునిక ఆలోచనలు, సాంకేతికతతో ఇది ఒక అద్భుతమైన ఆసుపత్రి అని సచిన్ అన్నారు. అందరికీ ఎంతో కొంత ఒత్తిడి ఉంటుందని.... కానీ అంతర్గతంగా ఒత్తిడిని సానుకూలంగా తీసుకున్నపుడు మనకు మార్గం సుగమవుతుందని సచిన్ పేర్కొన్నారు. స్పోర్ట్స్ మెడిసిన్‌లో భారత్ ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తోందని సచిన్ అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు క్రికెట్ ని మాత్రమే భారత్ లో ఎక్కువగా అభిమానించే వారని... కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వస్తుందని... పలు క్రీడలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. అయితే అథ్లెటిక్స్ని ప్రోత్సహించటం నిజంగా హర్షించాల్సిన విషయమని సచిన్ అభిప్రాపడ్డారు. క్రికెటర్గా కేవలం ప్రజలకు వినోదం అందిస్తున్నానని.. కారి వారి ప్రాణాలను కాపాడటంలో వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని సచిన్ వైద్యులకు కితాబులిచ్చారు.
ఇదీ చూడండి: 'పెండింగ్ ప్రాజెక్టులను పట్టాలెక్కించండి'