హోంశాఖ మాజీ మంత్రి ఇంద్రజిత్ గుప్త 101 జయంతి సందర్భంగా ఆయన గుప్త చిత్ర పటానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డితోపాటు పశ్చిమ బంగ సీపీఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పశ్చిమ బంగలో జన్మించిన ఇంద్రజిత్... విద్యార్థి దశ నుంచి ఉద్యమాలకు ఆకర్షింతులై కమ్యూనిస్టులో చేరి అంచెలంచెలుగా ఎదిగారని చాడ పేర్కొన్నారు. ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 11 సార్లు పార్లమెంట్ సభ్యుడి ఎన్నికయ్యారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలు లేవనెత్తడమే కాకుండా.. రాజకీయ విలువల కోసం పరితపించారని కొనియడారు.
ఇవీ చూడండి: సీతారాములను వదలని కరోనా.. కల్యాణంపై కొవిడ్-19 ఎఫెక్ట్