హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ సేవలను తెలంగాణ మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కొనియాడారు. సిటీ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ నాయకత్వంలో సిబ్బంది అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారంటూ ప్రశసించారు. కరోనా లాంటి కష్టకాలంలోనూ ముందుండి సేవలు చేస్తున్న పోలీసులను చూసి గర్విస్తున్నానంటూ కితాబిచ్చారు.
భగవంతుడు పోలీస్ సిబ్బందికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ.. శుభాకాంక్షలు తెలిపారు. ఓ టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన తరవాత ఓ సామాన్య వ్యక్తిలా మాత్రమే ఇలా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు