పాదచారుల ప్రాజెక్టులో భాగంగా రూ.2.3 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఎలక్ట్రిక్ బోల్లర్డ్స్ ప్రాజెక్టు పూర్తి కావడంతో జీహెచ్ఎంసీ అధికారులు వాటి పనితీరును పరిశీలించారు. వాహనాల రాకపోకలు నియంత్రించడానికి చార్మినార్ వైపు ఉన్న నాలుగు దారులలో వీటిని ఏర్పాటు చేశారు. రాకపోకలను నిలిపివేసేందుకు చార్మినార్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రముఖులు వచ్చినప్పుడు మాత్రమే వీటిని తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఆ బారికేడ్ల స్థానంలో ఎలక్ట్రిక్ బోల్లర్డ్స్ ఏర్పాటు చేశారు. రానున్న బోనాలను దృష్టిలో ఉంచుకొని జీహెచ్ఎంసీ అధికారులు వాటి పనితీరును పరిశీలించారు.
ఇదీ చూడండి: లక్నవరం వెలవెల.. తగ్గిన పర్యటక కళ