ETV Bharat / state

'వీలైనంత త్వరగా అటవీ అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలి'

అటవీ శాఖ అనుమతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హేమంత్ కుమార్ అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తి అయితేనే వాటి ఫలాలు త్వరగా అందుతాయని తెలిపారు. అరణ్య భవన్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో 109 పనులు, ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులపై చర్చించారు.

forest-officers-review-meeting-at-aranya-bhavan-on-environmental-permissions-to-projects
'వీలైనంత త్వరగా అటవీ అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలి'
author img

By

Published : Mar 23, 2021, 7:48 PM IST

ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేసి, వీలైనంత త్వరగా అటవీ అనుమతుల ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రతీ ఉద్యోగిపైనా ఉందని కేంద్ర అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హేమంత్ కుమార్ అన్నారు. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి శోభ నేతృత్వంలో వివిధ శాఖల ప్రాజెక్టులు, అటవీ అనుమతులపై అరణ్య భవన్‌లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. అవసరమైన విధి విధానాలు పాటించడంపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తి అయితేనే వాటి ఫలాలు త్వరగా అందుతాయని, జాప్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపైనే ఉంటుందని ఆయన వివరించారు. 109 పనులు, ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులపై చర్చించారు.

సాగునీరు, నీటి సరఫరా, జాతీయ రహదారులు, రోడ్లు-భవనాలు, సింగరేణి, విద్యుత్ శాఖల అనుమతుల ప్రక్రియ, స్టేజ్-1, స్టేజ్-2 అనుమతుల దశలు... వాటిని వేగవంతం చేయడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. ఏవైనా అడ్డంకులు ఉంటే వాటి పరిష్కారం కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. మూడేళ్లకు పైబడిన స్టేజ్ -1 అనుమతులను నెలరోజుల్లో, రెండేళ్లు దాటిన వాటిని రెండు నెలల్లో, ఏడాదికిపైగా పెండింగ్‌లో ఉన్న వాటిని మూడు నెలల్లో అనుమతుల ప్రక్రియ పూర్తి చేసేందుకు వీలుగా ప్రత్యామ్నాయాలపై చర్చించారు.

అటవీకరణ నిధుల చెల్లింపు, మళ్లించిన అటవీ భూమికి బదులుగా అటవీకరణ కోసం ప్రభుత్వ భూమిని కేటాయించిన నివేదికను సమర్పించాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలని అటవీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. న్యాయపరమైన అడ్డంకులు రాకుండా చూసుకోవాలని, అదే సమయంలో సరైన అటవీ అనుమతులు లేకుండా పనులు ప్రారంభిస్తే సంబంధిత అధికారులు చిక్కుల్లో పడతారని ఉన్నతాధికారులు హెచ్చరించారు.

ఇదీ చదవండి: పరీక్షలు పెంచాలి.. కేంద్రం నూతన మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.