రాష్ట్రంలో మద్యం షాపులను అనుమతించిన ప్రభుత్వం... దేవాలయాల్లో భౌతిక దూరం పాటిస్తూ పూజలు చేసుకొనేందుకు అనుమతివ్వాలని భాజపా డిమాండ్ చేసింది. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని ఇసామియా బజార్లో బస్తీ వాసులకు భాజపా నాయకుడు ఓం ప్రకాశ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రతి భాజపా కార్యకర్త పేదల ఆకలి తీర్చాలంటూ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు... ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఓం ప్రకాశ్ తెలిపారు.
లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... లాక్డౌన్ పూర్తయ్యేవరకు ప్రతి బస్తీలో పేదల ఆకలి తీర్చేందుకు పని చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం కంటే... ఖాజానాపైనే ఆసక్తి ఉందని ఓం ప్రకాశ్ ఎద్దేవా చేశారు.