Panjagutta Flyover: హైదరాబాద్లోని పంజాగుట్ట శ్మశానవాటికపై రెండో పైవంతెన ప్రారంభమైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పైవంతెనను ప్రారంభించారు. ఈ వంతెనతో పంజాగుట్ట నాగార్జున కూడలి వద్ద ట్రాఫిక్ సమస్య తీరనుంది. నాగార్జున కూడలి నుంచి కేబీఆర్ పార్కు కూడలి వైపు రాకపోకలు సాఫీగా సాగనున్నాయి.
ఈ రోజు నుంచి వంతెన ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్లు మంత్రులు పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. పంజాగుట్ట శ్మశానవాటికలోని ఉక్కుదిమ్మలపై వంతెనను నిర్మించారు. శ్మశానవాటిక సమాధుల పైనుంచి చట్నీస్ హోటల్ వైపు వెళ్లేలా.. ఉక్కు వంతెనను తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీమేయర్, ఇతర తెరాస నేతలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మాస్క్ తప్పనిసరి కాదు.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక లేదు.. బ్రిటన్లో కొత్త రూల్స్!