Hussain Sagar Bridge: హైదరాబాద్ మహానగరానికి మరో ప్రత్యేక అదనపు హంగు జతకానుంది. రష్యా రాజధాని మాస్కోలో మోస్ప్కా నదితీరంలో చేపట్టిన తరహాలో హుస్సేన్ సాగర్‌పై తేలియాడే వంతెనను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పీవీ ఘాట్ వద్ద పర్యాటకులకు అందుబాటులో ఉండేలా హెచ్ఎండీఏ శరవేగంగా పనులు చేస్తోంది. నడుకుచుంటూ వెళ్లి హుసేన్‌సాగర్ పరిసరాలను వీక్షించేలా వాక్‌వే నిర్మించనున్నారు.
flying bridge in tankbund: మాస్కోలో తేలియాడే వంతెన ఉత్తమపర్యాటక ప్రాంతాల్లో ఆ బ్రిడ్జి ఒకటిగా నిలుస్తోంది. నది లోపలకి యూ ఆకారంలో దాదాపు 70 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఆ వంతెనపై ఉంటే నదిలో తేలుతున్న అనుభూతి కలుగుతుంది. నది లోపల ఎలాంటి స్తంభాలు లేకుండా రోప్‌వే ద్వారా తీర్చిదిద్దిన విధానం ఇంజినీరింగ్‌లో ఓ అద్భుతంగా నిపుణులు పేర్కొంటారు. ఆ బ్రిడ్జినిర్మాణంలో పారదర్శకమైన గాజును వినియోగించారు.
దుర్గంచెరువుపై తీగలవంతెనకు ఉపయోగించిన సాంకేతికతనే తేలియాడే బ్రిడ్జికి ఉపయోగించనున్నారు. వంతెనపై నిల్చొని కిందకు చూస్తే నది అలలు, ప్రకృతి రమణీయ అందాలు స్పష్టంగా కనిపిస్తాయి. హుస్సేన్‌సాగర్‌పై ఇలాంటి వంతెన అందుబాటులోకివస్తే భాగ్యనగర పర్యాటక ముఖచిత్రమే మారిపోనుంది. ఇప్పటికే ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డును ఏటా లక్షలాది మంది వీక్షిస్తుంటారు. ఈఏడాది ఆఖరు నాటికి ఇంజినీరింగ్ అద్భుతం కళ్ల ముందు ఆవిష్కృతం కానుంది.