ETV Bharat / state

అవును.. ఈ పువ్వులు వాడిపోవు - hyd

పువ్వులతో మనకు ఉండే అనుబంధం ఏళ్లనాటిది. ప్రియురాలికి ప్రేమను తెలుపుతూ.. ప్రియుడు ఇచ్చే గులాబీ, తొలిసారిగా ఓ భార్యకు... భర్త కొనిచ్చే మల్లెలు, అమ్మ జడలోంచి రాలిన చామంతి, మన తోటలో పూసిన మందారం.. ఇవన్నీ అపురూపంగా భావిస్తాం. అవి వాడిపోతుంటే మాత్రం మనసుకు ఎంతో బాధ. మరి అలాంటి పూలను జీవితాంతం తాజాగా ఉంచితే... ఆ ఆలోచనే అద్భుతంగా ఉంది కదూ.

అవును.. ఈ పువ్వులు వాడిపోవు
author img

By

Published : Apr 21, 2019, 8:32 AM IST

పూలు చూడగానే మనస్సుకు ఆనందం, ఆహ్లదం కలుగుతాయి. గులాబీ, చామంతి, బంతి, మందార, మల్లె ఇలా ఎన్నిరకాల పువ్వులున్నా... వేటి సోయగం వాటిదే. మనం ఎంత మనసు పారేసుకున్నా... పుష్పాల సోయగం ఉండేది కొన్ని గంటలే. ఈ సమస్య రాకుండా హైదరాబాద్​కు చెందిన మహాలక్ష్మి ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు.

అవును.. ఈ పువ్వులు వాడిపోవు

ఏళ్లతరబడి తాజాగా:

ప్రతి పువ్వుకు తనదైన ప్రత్యేకత, రంగు, పరిమళం ఉంటాయి. నచ్చిన పూలు ప్రియమైన వారు ఇస్తే... పదిలంగా దాచుకోవాలని ఎవరనుకోరూ. అందుకే ఏళ్లతరబడి తాజాగా ఉండే పువ్వులను లియోఫ్లోరల్స్​ పేరుతో అందిస్తున్నారు హైదరాబాద్​కు చెందిన మహాలక్ష్మి.

తల్లికి కానుకగా ఇచ్చిన పూలు వాడిపోయినప్పుడు.. మహాలక్ష్మీ పడ్డ బాధే పూల ప్రిజర్వేషన్ గురించి ఆలోచించేలా చేసింది. దాదాపు 15ఏళ్ల పాటు పరిశోధించి... తల్లి పదవీ విరమణ సమయానికి లియోఫిలిసేషన్​ పద్ధతిని కనుగొన్నారు.

రంగూ, రూపూ, వాసన కోల్పోకుండా:

బెంగళూరు, పుణెతో పాటు విదేశాల నుంచి తాజా పూలను సేకరించి ఫ్రీజ్‌ చేస్తారు. హైడ్రేషన్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చిన తర్వాత సాంకేతికత ద్వారా రంగూ, రూపూ, వాసన కోల్పోకుండా ఆరబెడతారు. మైనస్‌ డిగ్రీల నుంచి పువ్వు రేకులను ప్రాసెస్‌ చేసే క్రమంలో గది ఉష్ణోగ్రతకు తీసుకొస్తారు. చివరగా పోస్ట్‌ ప్రాసెసింగ్‌ చేసి గ్లాస్‌ లేదా క్రిస్టల్‌ ఫ్రేములో అందంగా అమరుస్తారు. వివిధ రూపాల్లో బహుమతులుగా తీర్చిదిద్దుతున్నారు.

లియోఫ్లోరల్స్ డాట్​ కామ్ ద్వారా పూల కానుకలను విక్రయిస్తున్న మహాలక్ష్మి... ప్రత్యేకంగా వినియోగదారుల కోరిక మేరకు కస్టమైజ్​డ్ గిఫ్టులు ​అందిస్తున్నారు. ఈ పరిజ్ఞానాన్ని అందరికి చేరువ చెయ్యటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

Intro:tg_kmm_04_20_cbn_janmadina_vedukalu_av_c4
( )

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 69 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు రామనాథం కేక్ కట్ చేసి ఇ మిఠాయిలు పంచారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి జోహార్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. ..

Body:చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

Conclusion:చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.