ETV Bharat / state

పూలపై కరోనా దెబ్బ... అల్లాడుతున్న రైతన్నలు

కరోనా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పూలకు సైతం కరోనా రూపంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. పూలరైతులు ఇప్పట్లో కొలుకునే పరిస్థితులు కనిపించడం లేదు. మార్కెట్‌ బోసిపోవడం, వ్యాపారాలు లేకపోవడం, మంచి ధరలు లభించకపోవడం... పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రావడం లేదు. శ్రావణమాసంలో చేసే వరలక్ష్మి వ్రతం వేళ... పూల కళల్లో ఆనందం కనిపించడం లేదు.

author img

By

Published : Jul 30, 2020, 9:31 AM IST

flowers-business-loss-effect-of-corona-in-telugu-states
పూలపై కరోనా దెబ్బ... అల్లాడుతున్న రైతన్నలు

తెలుగు రాష్ట్రాల్లో పూల వ్యాపారంపై కరోనా దెబ్బతగిలింది. మార్కెట్లన్నీ బోసిబోయి దర్శనమిస్తున్నాయి. కొవిడ్-19 నేపథ్యంలో కుదేలైన వ్యవసాయ రంగం ఇప్పట్లో కొలుకునేలా లేదు. వ్యవసాయ అనుబంధ ఉద్యాన, పాడి, కోళ్ళ పరిశ్రమ దెబ్బతినడంతో రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఉద్యాన భాండాగారంగా పేరుగాంచిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి ఆరుగాలం శ్రమించి... తీరా పూలు మార్కెట్‌కు తీసుకొస్తే సరైన ధరలు లేకపోవడంతో వినియోగదారులు అడిగిన ధరలకు ఇచ్చేసి వెళ్లాల్సి వస్తుంది. దీంతో రైతులు నష్టాలు చవిచూస్తోన్నారు.

గిట్టుబాటు లేక..

బంతి కిలో 100 నుంచి 120 రూపాయలు, లిల్లీ -50 రూపాయలు, మల్లెపూలు - 100 రూపాయలు, సెంట్ గులాబీ - 30 నుంచి 40 రూపాయలు, గులాబీ మలబార్ - 80 రూపాయలు, ఎర్ర చేమంతి - 120 నుంచి 150 రూపాయలు, పచ్చ చేమంతి - 40 నుంచి 80 రూపాయలు చొప్పున ధరలు పలుకుతున్నాయి. నాణ్యత బట్టి ధరలు నమోదవుతున్నాయి. రోజంతా పూలు అమ్ముకుంటున్నా గిట్టుబాటు కావడంలేదని రైతులు వాపోతోన్నారు.

అనుమతి ఇవ్వలేదు..

హైదరాబాద్ చుట్టు పక్కల రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాల్లో ఈసారి పెద్దగా రైతులు బంతి పూల సాగు చేపట్టలేదు. కరోనా కట్టడి, లాక్‌డౌన్ ఆంక్షలు కఠినంగా ఉండటంతో... బత్తి సహా ఇతర పూల పంటలు సాగు చేసేందుకు రైతులు వెనుకంజ వేశారు. అదే సమయంలో అప్పడే చేతికొస్తున్న పంట ఉత్పత్తులు మార్కెట్‌లో అమ్ముకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అప్పట్లో కేవలం కూరగాయలు, పండ్ల విక్రయాలకే అనుమతి ఇచ్చిన మార్కెటింగ్ శాఖ... అందుకు అనువైన వాతావరణం కల్పించడం ద్వారా రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది.

కుటుంబం కోసం..

హైదరాబాద్‌లో సాధరణంగా పూల మార్కెట్‌ బాగుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద విపణి నగరమే. అదీకాక... ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి బంతి, గులాబీ, మల్లె, చేమంతి, జెర్బరా, కార్నేషన్, ఇతర అలంకరణ పూలు నగరానికి వస్తాయి. తాజా క్లిష్టపరిస్థితుల్లో రైతులు ఉత్పత్తులు మార్కెట్‌కు తీసుకురాకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఇతర రాష్ట్రాల నుంచే వచ్చేవి అమ్ముడుబోతున్నాయి. ప్రభుత్వ సభలు, సమావేశాలు, ప్రైవేటు కార్యక్రమాల్లేవు. బహుమతులుగా ఇచ్చే బోకేలకు గిరాకీ లేకుండాపోయింది. వివాహాది శుభకార్యాలు, విందు, వినోదాలు, దేవాలయాల్లో భక్తులకు దర్శనాలు, పూజాది కార్యక్రమాలన్నీ ఆగిపోవడంతో పూల వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. లాక్‌డౌన్ ఆంక్షల నిబంధనలకు అలవాటుపడ్డ వినియోగదారులు భయంతో పూలు కొనడంలేదు. అమ్ముడవక ఒక్కోసారి పూలు, దండలు పారబోస్తున్నారు. గిట్టుబాటుకాకపోయినా తమ కుటుంబం కోసం దందా చేస్తున్నామని చిరువ్యాపారులు చెబుతున్నారు.
రాబోయేది శ్రావణ శుక్రవారం కావడంతో అమాంతం పూలకు డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా కొందరు వ్యాపారులు, దళారులు మాత్రం పూల మార్కెట్‌లో చెలరేగిపోతున్నారు. ఇష్టారాజ్యంగా ధరలు పెంచేసి విక్రయిస్తున్నారు. పల్లెల నుంచి తీసుకొచ్చిన పూలకు మార్కెట్‌లో వ్యాపారులు సరైన రేట్లు ఇవ్వరు. అదే పూలు కొన్న వర్తకులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

ఇటీవల కాలంలో ఇరు రాష్ట్రాల్లో పూల విత్తనాలు సహా సూక్ష్మసేద్యం సాంకేతిక పరిజ్ఞానం, మల్చింగ్‌, ఇతర పనిముట్లపై రాయితీలు ఎత్తివేయడంతో... రైతులకు పెట్టుబడి భారంగా పరిణమిస్తోంది. కొన్నేళ్ల తరబడి పూల సాగులో ఉన్న సంప్రదాయ రైతులు సాగుకు దూరమవుతుండటం శోచనీయం.

ఇదీ చూడండి: చెట్టుని ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. ఇద్దరు మృతి.. ఒకరికి తీవ్రగాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.