ETV Bharat / state

'వరద' బారులు:  మీసేవా కేంద్రాల్లో గంటలకొద్దీ బాధితులు - హైదరాబాద్​ మీసేవా కేంద్రాల లైన్లు

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వరదలకు నష్టపోయిన బాధితులు మీ-సేవా కేంద్రాల వద్ద బారులు తీరారు. పరిహారం అందనివాళ్లు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. గ్రేటర్‌ ఎన్నికల వేళ.. ఈ ప్రక్రియకు కోడ్‌ అడ్డంకి కాదని రాష్ట్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. నేరుగా ఖాతాల్లో డబ్బు జమచేయవచ్చని సూచించింది. దీంతో బాధితులు మీ-సేవా కేంద్రాల వద్ద క్యూ కట్టారు. రద్దీ దృష్ట్యా అదనపు కౌంటర్లు, సిబ్బందిని నియమించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

hyderabad floods
hyderabad floods
author img

By

Published : Nov 17, 2020, 3:33 PM IST

ఇటీవల భారీ వర్షాలు, వరదలకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో తీవ్ర నష్టం వాటిల్లింది. వందలాది కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోని సామగ్రి మొత్తం పాడైపోయింది. కొన్నిచోట్ల వారాల పాటు బాధితులు పునరావాస కేంద్రాల్లోనే గడిపారు. అనేక మంది ఇళ్లు వదిలేసి వెళ్లారు. 100 ఏళ్లలో కనివినీ ఎరుగని రీతిలో కురిసిన వర్షాలకు హైదరాబాద్‌ అతలాకుతలమైంది. బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 10 వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. దాదాపు రూ.500 కోట్ల వరకు అందించారు. సాయం అందని బాధితులు అనేక మంది ధర్నాలు, ఆందోళనలకు దిగారు. స్పందించిన ప్రభుత్వం అర్హులందరికీ సాయం చేస్తామని భరోసా ఇచ్చింది. మీ-సేవా కేంద్రాల్లో ధరఖాస్తు చేసుకుంటే నగదును నేరుగా ఖాతాల్లోనే వేస్తామని చెప్పింది. ఈ ప్రకటనతో గ్రేటర్‌ పరిధిలో వరద బాధితులు మీ-సేవా కేంద్రాల వద్ద బారులు తీరారు.

నమోదు చేసుకున్న మరుసటిరోజే

ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగానే వరద ముంపు ఆర్థిక సాయం తక్షణమే అందుతుండగా బాధితులు పేర్ల నమోదుకు క్యూ కడుతున్నారు. మీ-సేవలో పేర్లు నమోదు చేసుకున్న మరుసటి రోజునే నగదు ఖాతాల్లో జమ అవుతోందని బాధితులు చెబుతున్నారు. చందానగర్‌లోని మీ-సేవా కేంద్రం వద్దకు మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శేరిలింగంపల్లి పరిధిలో ఉన్న మీ-సేవా కేంద్రం వరద బాధితులతో కిటకిటలాడింది. అంబర్‌పేట్‌ పోలీస్ లైన్‌లోని మీ-సేవా కేంద్రాల వద్ద పెద్దసంఖ్యలో బాధితులు బారులు తీరారు. బాధితులు భౌతిక దూరం పాటించకపోవడంతో పాటు గందరగోళం తలెత్తగా మీ-సేవా కేంద్రాన్ని పోలీసులు మూసివేయించారు.

ఉదయం నుంచే

సికింద్రాబాద్‌ మారేడుపల్లిలోని మీ-సేవా సెంటర్‌లో 10 వేల సాయం దరఖాస్తు చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు క్యూ కట్టారు. ఉదయం 8 గంటలకే మీ-సేవా కేంద్రాలకు తరలివచ్చారు. అడ్డగుట్ట, తుకారాంగేట్‌, సీతాఫల్‌మండి, చిలకలగూడ, బేగంపేట్‌, రాణిగంజ్‌, మారేడుపల్లి, లాలాగూడ సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌ నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకునేందుకు బాధితులు చేరుకున్నారు. నిన్న మీ-సేవా సెంటర్‌లో టోకన్ల పద్ధతిని ప్రవేశపెట్టిన నిర్వాహకులు... మాటమార్చగా గందరగోళం తలెత్తింది. ఇబ్బందులు కలగకుండా పోలీసులు వృద్ధులను ముందు పంపించారు.

మాకే ఎందుకు?

వరద సాయం కోసం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మీ-సేవా సెంటర్ల వద్ద బాధితులు బారులు తీరారు. రద్దీ ఎక్కువ కావడం వల్ల జనం కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరికి నేరుగా నగదు ఇచ్చి తమను నమోదు చేసుకోవాలనడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : గ్రేటర్ నగారా: డిసెంబరు 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.