విమానాన్ని కూల్చిన ఉగ్రవాదులు.. జిహాద్ అంటూ నినాదాలు చేసి బతికి ఉన్నవాళ్లను, క్షతగాత్రులను తరలించడం మొదలు పెట్టారు. అప్పుడే అక్కడికి వచ్చిన పోలీసులు ఉగ్రవాదులను మట్టుబెట్టడం.. సహాయం కోసం ఆక్రందనలు చేస్తున్న క్షతగాత్రులను కాపాడడం.. ఇలాంటి ప్రమాదాలు, విపత్తులు జరిగినప్పుడు గాయపడిన వారికి చికిత్స ఎలా అందించాలనే విషయంపై మాక్‌డ్రిల్ నిర్వహించారు. నిజంగానే ఘటన జరిగినట్లున ప్రదర్శన చేయడం అద్భుతంగా ఉందని పలువురు ప్రశంసించారు.
సైన్స్ మేళాలో భాగంగా గాంధీ ఆసుపత్రిలో నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ హాజరయ్యారు. విపత్తులు జరిగినప్పుడు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాల్సి ఉండాలనే కథను తెలియజేసేలా ప్రదర్శన ఉందని కొనియాడారు.
ఇదీ చూడండి : కుమార్తెను వ్యభిచారం చేయాలంటూ తల్లి ఒత్తిడి