రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసే వారికి వినూత్నరీతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోటరీ క్లబ్ నిర్వాహకులు. స్టాప్ స్పిట్టింగ్ ఇండియా లక్ష్యంతో హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ఫ్లాష్ మాబ్ కార్యక్రమం చేపట్టారు. రోటరీ క్లబ్, పలు ఎన్జీఓ సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన యువతి, యువకులు, పెద్దలు డాన్సులతో అదరగొట్టారు.
యువత ఫ్లాష్ మాబ్ డాన్సులు చేస్తూ ఉమ్మివేయడం ఆపండి అంటూ సందేశాన్నిచ్చారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం ముఖ్యంగా యూత్ కృషి చేయాలని సూచించారు. బెంగళూరులో తాము చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైందని రోటరీ క్లబ్ సభ్యురాలు శ్రీదేవి తెలిపారు. హైదరాబాద్‌ను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం కోసం తమవంతు కృషి చేస్తున్నామని వెల్లడించారు.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదనే సందేశంతో ఈ కార్యక్రమం నిర్వహించిన్నట్లు రోటరీ క్లబ్ నిర్వాకులు స్పష్టం చేశారు. ఉమ్మి వేయడం నిర్మూలించడం ద్వారా కొవిడ్‌ను సైతం అడ్డుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. త్వరలో హైదరాబాద్ అంతా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్టాప్ స్పిట్టింగ్ ఇండియా నినాదాన్ని పాటించాలని ఆమె కోరారు.
ఇదీ చూడండి: ts assembly session: అక్టోబర్ 5వరకు అసెంబ్లీ సమావేశాలు.. ప్రోటోకాల్‌పై స్పష్టమైన ఆదేశాలు..!