లింబో ఫైర్ స్కేటింగ్లో ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన ఐదేళ్ల బాలిక రిషిత ప్రపంచ రికార్డు నెలకొల్పింది. తణుకులో నిర్వహించిన ఫైర్ స్కేటింగ్లో ఈ ఘనత సాధించింది. వజ్ర వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఆమె ప్రతిభను స్వయంగా పరిశీలించి రికార్డు నమోదు చేశారు.
ఎనిమిది అంగుళాల ఎత్తులో మంటల కిందనుంచి 20 మీటర్ల పొడవున స్కేటింగ్ చేసి రికార్డు సాధించింది. ఏడాదిన్నరగా స్థానికంగా ఉన్న కోచ్ వద్ద శిక్షణ పొందుతున్న రిషిత తన ప్రతిభను నిరూపించుకుంది. గతంలో లింబో ఫైర్ స్కేటింగ్లో ఇటువంటి రికార్డు నెలకొల్పడం ఇదే ప్రథమమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. రికార్డు సాధించిన రిషితను సంస్థ ప్రతినిధులు సత్కరించి ధ్రువపత్రం, మెడల్, జ్ఞాపిక బహుకరించారు. రిషితను పలువురు అభినందించారు.
ఇదీ చదవండి: నేటి నుంచే మేడారం చినజాతర... సర్వం సిద్ధం