దక్షిణ మధ్య రైల్వే జోన్లలోని అన్ని డివిజన్లలో రైల్వే క్రీడా సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు 15నుంచి ప్రారంభమైన ఫిట్ ఇండియా కార్యక్రమం అక్టోబర్ 2తో ముగిసిందని ద.మ.రైల్వే సీపీఆర్ఓ రాకేశ్ తెలిపారు. స్థూలకాయం, ఒత్తిడి, బద్ధకం, ఆందోళనతో బాధపడుతున్న వారు శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని వెల్లడించారు. రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు.
రైల్వేలో విధులు నిర్వహిస్తున్న ప్రముఖ క్రీడాకారులు శారీరక దారుఢ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఫిడ్ ఇండియా ప్రచార కార్యక్రమంలో భాగంగా జోన్లో బాధ్యతలు నిర్వహిస్తున్న రైల్వే సిబ్బందిలో నడక, పరుగు, ఇతర వ్యాయామాల వంటి రోజువారి కార్యకలాపాలపై అవగాహన పెంచేందుకు మొబైల్ యాప్ రూపొందించారు. దీనిద్వారా ఉద్యోగులను చురుకుగా ఉంచడమేగాక వినోదాత్మక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాకేశ్ తెలిపారు.