ETV Bharat / state

ఎల్బీ స్టేడియంలో "ఫిట్​ ఇండియా - ఫిట్​ తెలంగాణ ఫ్రీడం రన్​" - తెలంగాణ తాజా వార్తలు

ఆరోగ్యకరమైన తెలంగాణ సాధించాలంటే ప్రతి ఒక్కరు వాకింగ్‌, రన్నింగ్‌ చేయాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో "ఫిట్‌ ఇండియా- ఫిట్‌ తెలంగాణ ఫ్రీడం రన్‌" ను మంత్రి ప్రారంభించారు.

ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా "ఫిట్​ ఇండియా- ఫిట్​ తెలంగాణ ఫ్రీడం రన్​"

author img

By

Published : Oct 2, 2020, 11:51 AM IST

ఆరోగ్యవంతమైన తెలంగాణ సాధన కోసం ప్రతి ఒక్కరు పరుగు, నడకను రోజు వారి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకోవాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో "ఫిట్‌ ఇండియా - ఫిట్‌ తెలంగాణ ఫ్రీడం రన్‌"ను మంత్రి ప్రారంభించారు.

ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా "ఫిట్​ ఇండియా- ఫిట్​ తెలంగాణ ఫ్రీడం రన్​"

కార్యక్రమంలో ప్రముఖ బ్యాడ్మింటన్‌ శిక్షకుడు పుల్లెల గోపిచంద్‌తో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి మంత్రి వ్యాయామం చేశారు.

క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తుందని... ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియం నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రతి సంస్థ క్రీడాకారులకు 0.5 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని...లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 2,009 మందికి కరోనా, 10 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.