ETV Bharat / state

నేడు ఇంజినీరింగ్​ మొదటి విడత సీట్ల కేటాయింపు - కన్వీనర్​ నవీన్​ మిత్తల్

ఈ ఏడాది ఎంసెట్​ ఇంజినీరింగ్​ మొదటి విడత సీట్లను నేడు కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థుల చరవాణులకు సంక్షిప్త సందేశాలు అందుతాయని కన్వీనర్​ నవీన్​ మిత్తల్​ తెలిపారు. ఈ నెల 15లోగా  విద్యార్థులు ఆన్​లైన్​లో కళాశాలకు సెల్ఫ్​ రిపోర్ట్​ చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65,444 సీట్లు ఉండగా... 52,629 మంది మాత్రమే కౌన్సెలింగ్​లో వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఈ ఏడాది కూడా సీఎస్​ఈ, ఐటీ, ఈసీఈల వైపే ఎక్కువగా మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

ఈ నెల 15లోగా ఆన్​లైన్​లో కళాశాలకు వ్యక్తిగతంగా రిపోర్ట్​ చేయాలి : ఎంసెట్ కన్వీనర్
author img

By

Published : Jul 10, 2019, 4:19 AM IST

Updated : Jul 10, 2019, 9:41 AM IST

నేడు ఎంసెట్​ ఇంజినీరింగ్​ మొదటి విడత సీట్ల కేటాయింపు

ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లు ఇవాళ కేటాయించనున్నారు. కన్వీనర్ కోటాకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 33 కోర్సుల్లో 65,444 సీట్లు ఉండగా... 52,629 మంది మాత్రమే కౌన్సెలింగ్​లో వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. సీట్ల కేటాయింపు అనంతరం సుమారు 13 వేల సీట్లు మిగిలిపోనున్నాయి. సీట్లు పొందిన విద్యార్థుల మొబైల్​ఫోన్లకు సంక్షిప్త సందేశాల ద్వారా వివరాలు అందుతాయని కన్వీనర్​ నవీన్​ మిత్తల్​ తెలిపారు. ఈ నెల 15లోగా విద్యార్థులు ఆన్​లైన్​లో కళాశాలకు వ్యక్తిగతంగా రిపోర్ట్​ చేయాలని తెలిపారు.

సంప్రదాయ కోర్సుల వైపే మొగ్గు

ఈ ఏడాది కూడా విద్యార్థులు సంప్రదాయ కోర్సులైన సీఎస్​ఈ, ఐటీ, ఈసీఈల వైపే ఎక్కువగా మొగ్గు చూపారు. ఎంసెట్​ ఇంజినీరింగ్​లో లక్షా పదివేల మంది ఉత్తీర్ణులైనప్పటికీ... 53,795 మంది మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. అయితే 52 వేల 629 మంది ఐచ్ఛికాలు నమోదు చేసుకున్నారు. మిగిలిన సీట్ల కోసం త్వరలో రెండో విడత షెడ్యూలును అధికారులు ప్రకటించనున్నారు.

ఇవీ చూడండి : పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి చేటు: చాడ

sample description
Last Updated : Jul 10, 2019, 9:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.