ETV Bharat / state

ఉ"మెన్" - SAVITRI BAI PULE

అనాది నుంచి స్త్రీని వంటింటికి పరిమితం చేసింది పురుషుడే అంటారు. అదే స్త్రీ అత్యున్నత శిఖరాలకు ఎదగడానికి కూడా కారణమైన పుణ్యపురుషులూ మనదేశంలో ఉన్నారు. పితృస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడే సమాజానికి ఎదురొడ్డి భార్య ఇష్టానికి గౌరవమిచ్చిన ఆమె ఆశయసాధనకై కృషి చేశారు.

ఉ"మెన్"
author img

By

Published : Mar 8, 2019, 8:00 AM IST

ఉ"మెన్"
స్త్రీ కేవలం వంటింటికే పరిమితం కాదు. ఆమెకు ఇష్టాలు, లక్ష్యాలుంటాయి. ఈ విషయం అర్థం చేసుకున్న ప్రతీ పురుషుడు మహిళా సాధికారత కోసం కృషి చేస్తాడు. అమ్మ, అక్కా, ఆలి అనే తేడా లేకుండా వారి ఇష్టాన్ని గ్రహించి వారికి నచ్చినట్టుగా నడుచుకుంటాడు. మహిళలకు కావల్సిన స్వేచ్ఛనిచ్చి తాను వెనకుంటూ వారిని ముందుకు నడిపిస్తాడు. అలాంటి మహనీయుల ప్రోత్సాహంతో భారతదేశ తొలి గురువుగా, వైద్యురాలిగా పేరుపోందిన మహిళా మణుల గురించి మీకోసం.

భారతదేశ తొలి మహిళా గురువు

మనదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలే. ఈమె 1831లో మహారాష్ట్రలోని సతారా జిల్లా నయాగావ్​లో జన్మించారు. సావిత్రి బాయి పూలేకు చదువంటే చాలా ఇష్టం.... కుటుంబ పరిస్థితుల కారణంగా చదువుకోలేకపోయారు. పన్నెండేళ్లకే జ్యోతీరావు పూలేతో వివాహమైంది. భార్య ఆసక్తిని గుర్తించిన పూలే భార్యకి చదువు నేర్పించి ఉపాధ్యాయురాలిగా శిక్షణనిచ్చారు.

1848లో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలను కూడా ఏర్పాటు చేశారు. సావిత్రిబాయి పూలే ఉపాధ్యాయినే కాకుండా గొప్ప సంఘ సంస్కర్త, రచయిత్రి కూడా. కేవలం విద్య ద్వారానే స్త్రీకి విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన మహాసాధ్వి. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, బాల్య వివాహాలు, సతీసహగమనానికి వ్యతిరేకంగా భర్త జ్యోతీరావు పూలేతో కలిసి పోరాటం చేసింది.

భారతదేశ తొలి మహిళా వైద్యురాలు

ఆనందీ బాయి జోషీ పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ వైద్యురాలు. ఈమె మహారాష్ట్రలోని సనాతన సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో 1865లో జన్మించింది. ఆనాటి బ్రహ్మణుల కుటుంబాలలో మహిళలకు విద్య అనేది సర్వసాధారణంగా ఉండేది. ఆనందీ బాయికి తొమ్మిదేళ్ల వయసులోనే గోపాల్ రావు జోషీతో పెళ్లైంది. గోపాలరావు మొదట్నుంచీ స్త్రీలు చదువుకోవాలని ఆకాంక్షించేవాడు. భార్య ఆసక్తిన గ్రహించిన గోపాల రావు ఆనందీబాయి చదువుకోవడానికి సాయం చేశాడు.

ఆనందీ బాయికి 14 ఏళ్ల వయసులో ఒక కుమారుడు జన్మించాడు. ఆసమయంలో బాబుకి వైద్య సేవలు అందక పది రోజుల్లోనే చనిపోయాడు. తన కొడుకులా వైద్య సేవలు అందక ఎవరూ చనిపోకూడదని వైద్య వృత్తిని ఎంచుకుంది ఆనందీబాయి. భర్త ప్రోత్సాహంతో ఉన్నత విద్యనభ్యసించేందుకు అమెరికా వెళ్లింది. అక్కడ పరిస్థితులకు అలవాటు పడలేక తీవ్ర అనారోగ్యం పాలైంది. అయినప్పటికీ కష్టపడి చదివి భారతదేశ తొలి మహిళా వైద్యురాలిగా చరిత్రకెక్కింది. ఎంతో మంది ప్రజలకు వైద్య సేవలందించి మంచి పేరు సంపాదించింది.

undefined

ఇవీ చదవండి:బ్యాలెన్స్​ ఫర్​ బెటర్​

మనసులో ఉండాలి

Intro:tg_adb_91_07_kalapasmaglar_arrest_avb_c9

Body:ఏ. లక్ష్మణ్ ఇచ్చోడ కంట్రిబ్యూటర్ జిల్లా ఆదిలాబాద్
.......
కలప స్మగ్లర్ అరెస్ట్ రూ. 3 లక్షల 66 వేల కలప పట్టివేత
................
( ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బాబ్జి పేట శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన రూ .3 లక్షల 66 వేల విలువగల టేకు కలపను పోలీస్ శాఖ అధికారులు గుర్తించి స్వాధీన పర్చుకున్నారు. అలాగే అదే ప్రాంతంలో పోలీసులు ముందస్తు సమాచారంతో గస్తీ నిర్వహిస్తుండగా ఇండిగో కార్ లో కలపను తరలించే ప్రయత్నం కొందరు వ్యక్తులు చేయగా వారిని పొలీసులూ వెంబడించగా వారు పారిపోవడంతో అందులో ఒకరు ఒకరిని పట్టుకున్నారు ఈయన ఇచ్చోడ మండలం కేశపట్నం గ్రామానికి చెందిన కరుడుగట్టిన కలప స్మగ్లర్ షేక్ హసన్ అలియాస్ పింటూ హసన్ అని గుర్తించినట్లుగా ఇచోడ సిఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈయనపై నేరేడిగొండ, గుడిహత్నూర్, నిర్మల్,ఇచోడ మండల పోలీస్ స్టేషన్లలో అక్రమ కలప రవాణా లో విషయంలో అనేక కేసులు ఉన్నాయని గతంలోనూ అనేక సార్లు జైలుకు వెళ్లి వచ్చాడని తెలిపారు. నేరప్రవృత్తి మార్చుకోలేదని నేరప్రవృత్తి మార్చుకోకపోతే కేసులు నమోదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పిడి చట్టాన్ని ప్రయోగిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సిఐ తో పాటు ఇచోడ ఎస్ ఐ పుల్లయ్య, నెరదిగొండ ఎస్ఐ సుమన్ పాల్గొన్నారు.
బైట్:- శ్రీనివాస్ సిఐ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.