First Day Nominations in Telangana 2023 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు గత నెల 9న ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా.. శుక్రవారం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది. తొలిరోజు ఏకంగా 100 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజున ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి 8 మంది, బీజేపీ నుంచి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. అధికార పార్టీ నుంచి ఎవరూ దాఖలు చేయలేదు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తరఫున.. కొడంగల్‌లో ఆయన సోదరుడు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి తిరుపతిరెడ్డి నామినేషన్ వేశారు. హైదరాబాద్ గోశామహల్ కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతారావు అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ వేశారు.
First Day Nominations in Hyderabad : ఖైరతాబాద్‌లో సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా పార్టీ తరఫున జ్యోతి నామినేషన్ వేశారు. మలక్‌పేట్‌లో బీఎస్పీ అభ్యర్థి అలుగోల రమేశ్ నామినేషన్ వేశారు. వికారాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ 2 నామినేషన్లు దాఖలు చేశారు. చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కేఎస్ రత్నం తరఫున ఆయన కుమారుడు నామపత్రాలు దాఖలు చేశారు. సంగారెడ్డిలో మంజీరా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వీరాజ్ నామినేషన్ వేశారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
Nominations in Warangal District : ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలిరోజు పది మంది అభ్యర్ధులు 11 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్ధులు మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు.. స్వతంత్ర అభ్యర్థిగా బీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి నామినేషన్ వేశారు. పరకాలలో ఓ స్వతంత్ర అభ్యర్ధి, మహబూబాబాద్‌లో బీజేపీ రెబల్ అభ్యర్ధి గుగులోత్ వెంకన్న, పాలకుర్తి నుంచి స్వతంత్ర అభ్యర్ధి, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి మరో స్వతంత్ర అభ్యర్ధి నామపత్రాలు సమర్పించారు.
భూపాలపల్లిలో 2 నామినేషన్లు దాఖలు కాగా.. బీజేపీ నుంచి కీర్తిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ తరఫున ఆయన సతీమణి నామపత్రాలను సమర్పించారు. నర్సంపేట నుంచి ఎంసీపీఐ అభ్యర్థితో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి నామపత్రాలు దాఖలు చేశారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, జనగామ, డోర్నకల్, ములుగు నియోజకవర్గాల్లో తొలిరోజు నామినేన్లు(First Day Nominations) దాఖలు కాలేదు.
First Day Nominations in Khammam : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలిరోజు 8 నామినేషన్లు దాఖలయ్యాయి. ఖమ్మం జిల్లాలో 5, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 నామినేషన్లు దాఖలయ్యాయి. ఖమ్మం నియోజకవర్గంలో 3, పాలేరులో 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇద్దరు అభ్యర్థులు పార్టీల తరపున అభ్యర్థులుగా నామపత్రాలు దాఖలు చేయగా మరో ముగ్గురు స్వతంత్రులుగా నామినేషన్లు(Independent Candidate Nomination First Day) దాఖలు చేశారు. ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల నుంచి తొలి నామినేషన్ దాఖలైంది. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇల్లందు, కొత్తగూడెం నియోజకవర్గాల నుంచి ఇద్దరు స్వతంత్రులు నామపత్రాలు దాఖలు చేశారు. ఇల్లందు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోలెబోయిన రవి నామినేషన్ వేశారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి స్వతంత్రులుగా ఇద్దరు నామపత్రాలు అందజేశారు.
రాష్ట్రంలో నామినేషన్ ప్రక్రియ షురూ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
First Day Nominations in Nalgonda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి రోజు 16 నామినేషన్లు దాఖలయ్యాయి. మునుగోడు- 3, నకిరేకల్‌లో 3 నామినేషన్లు నమోదు కాగా.. నల్గొండ-2, మిర్యాలగూడ-2, ఆలేరు-2, నాగార్జునసాగర్- 1, సూర్యాపేట–1 , తుంగతుర్తి-1 , కోదాడలో 1 చొప్పున నామినేషన్లు నమోదు అయినట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు. అధికశాతం స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు నమోదు కాగా.. ఆలేరులో కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య నామినేషన్ వేశారు. కోదాడ స్వతంత్ర అభ్యర్థిగా అమెరికాలో ఉన్న ఓ ఎన్ఆర్ఐ ఆన్‌లైన్ ద్వారా నామినేషన్ దాఖలు చేశారు.
తెలంగాణలో మొదటిసారిగా ఎన్నారై ఆన్‌లైన్ నామినేషన్
Congress Nomination First Day in Telangana : జగిత్యాల జిల్లా కోరుట్లలో తొలిరోజు ఒకే నామినేషన్ దాఖలైంది. పెద్దపల్లిలో బీజేపీ రెబల్ అభ్యర్థి కారపురినరేష్ నామపత్రాలు దాఖలు చేశారు. నిర్మల్ బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో తొలి రోజు స్వతంత్ర అభ్యర్థి వేసిన ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. కుమురం భీం జిల్లా సిర్పూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్ తరఫున ఆయన కుటుంబసభ్యులు నామినేషన్ వేశారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీజేపీ అభ్యర్థి అమురాజుల శ్రీదేవి నామినేషన్ వేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఆలిండియా మజ్లిస్ ఈ-ఇంక్విలాబ్ మిల్లత్ పార్టీ తరపున శర్జీల్ పర్వేజ్ నామినేషన్ వేశారు. నామినేషన్ల సమాచారం తెలుసుకునేందుకు వెళ్లిన తమను అనుమతించకపోవటాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బీఎస్పీ నాయకులు(BSP Leaders Protest in Siddipet) ఆందోళనకు దిగారు.
ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవడమంటే ఏంటో తెలుసా? ఎన్ని ఓట్లు వస్తే సేఫ్?