ETV Bharat / state

RPF Constable Gun Firing Case Update : జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌లో కాల్పుల ఘటన.. హైదరాబాదీ మృతి

AK-47 Gun Firing Case in Maharastra : మహారాష్ట్రలో సెంట్రల్​ సూపర్​ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్​లో జరిగిన ఘటనలో హైదరాబాద్​లో నివాసం ఉంటున్న సయ్యద్‌ సఫియుల్లా మృతి చెందాడు. గుజరాత్​లోని ఓ మొబైల్​ షాపులో పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అజ్మీర్​ నుంచి హైదరాబాద్​కి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు బాధితుడి మృత దేహాన్ని స్వస్థలానికి తరలిస్తారని పోలీసులు తెలిపారు.

RPF Constable Gun Firing Case Update
RPF Constable Gun Firing Case Update
author img

By

Published : Aug 1, 2023, 8:53 PM IST

Updated : Aug 1, 2023, 10:10 PM IST

Firing in Central Superfast Express at Maharashtra : మహారాష్ట్రలోని పాల్ఘర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో జైపుర్‌-ముంబయి సెంట్రల్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన కాల్పుల్లో హైదరాబాద్​లోని నాంపల్లిలో నివాసం ఉంటున్న సయ్యద్‌ సఫియుల్లా మృతి చెందాడు. అతను ముగ్గురు పిల్లలు, తన భార్యతో అజ్మీర్​ నుంచి ముంబయి మీదుగా హైదరాబాద్​ వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. బాధితుడు కర్ణాటకలోని బీదర్​కు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు.

మృతదేహాన్ని స్వస్థలమైన బీదర్​కి తరలించనున్నారని పోలీసులు తెలిపారు. కోఠి దగ్గర సయ్యద్​ గుజరాత్​ గల్లీలోని ఓ మొబైల్​ షాపులో ఉద్యోగిగా పని చేస్తున్నట్లుగా గుర్తించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సూచనల మేరకు... స్థానిక నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్... మృతి చెందిన సయ్యద్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. సయ్యద్ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా తాము అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు.

రైలులో కాల్పులు జరిగిన ఘటన సోమవారం ఉదయం 5 గంటల సమయంలో ఆర్​ఫీఎఫ్​ కానిస్టేబుల్​ చేతన్ సింగ్ తన పై అధికారిపై ఏకే-47 తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అధికారితో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. అనంతరం నిందితుడ్ని అధికారులు అదుపులోకి తీసుకుని.. అతని దగ్గర ఉన్న ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అసలు ఏమి జరిగిందంటే.. : మహారాష్ట్రలోని పాల్ఘర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో జైపుర్‌-ముంబయి సెంట్రల్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో సుమారు ఉదయం 5 గంటల తరవాత ఆర్​ఫీఎఫ్​ కానిస్టేబుల్ ఒకడు తన పై అధికారిపై ఏకే-47 తుపాకీతో కాల్పులు చేశాడు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురైయ్యారు. ఈ కాల్పల్లో అధకారి మృతి చెందాదడు. అతను రాజస్థాన్​కి చెందిన టికా రాం మీనాగా అధికారులు గుర్తించారు. అనంతరం ఆ కానిస్టేబుల్​ బీ5, ఎస్​6 బోగీలు సహా వాటి మధ్యలో ప్యాంట్రీ కార్​లోనూ ఒక్కో ప్రయాణికుడి చొప్పున కాల్పులు చేసి చంపాడు.

MP Asaduddin Owaisi Tweet on Gun Firing Incident : కాల్పులు అనంతరం ప్రయాణికులు రైలు చైను లాగారు. అప్పుడు నిందితుడు రైలు నుంచి దూకి తప్పించుకున్న సమయంలో గవర్నమెంట్​ ర్వైల్వే పోలీసులు, ఆర్​ఫీఎఫ్​ సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడ్ని నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చేతన్​ సింగ్​(34)గా అధికారులు గుర్తించి.. స్థానిక పోలీస్ స్టేషన్​కి తీసుకెళ్లారు.

ఈ రైలులో జరిగిన ఘటన ఉగ్రదాడి అని అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఘటనపై స్పందించి ట్వీట్​ చేశారు. దేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా నిరంతరం చేస్తున్న ద్వేషపూరిత ప్రసంగాలు, దాడులకు బీజేపీ మద్దతుదారులు రెచ్చగొడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

  • My tweet on the #JaipurExpressTerrorAttack has been withheld in India on the request of Government of India. What law did it violate? Is calling a terror attack a terror attack a crime? Wish the Modi govt was this proactive in preventing hate crimes against Muslims pic.twitter.com/U34tKUyOnb

    — Asaduddin Owaisi (@asadowaisi) August 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి :

Last Updated : Aug 1, 2023, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.