ETV Bharat / state

Monkey: 'ట్రాన్స్​ఫార్మర్​లో చిక్కుకున్న కోతిపిల్ల... ఎలా బయటకుతీశారో చూడండి' - ట్రాన్స్​ఫార్మర్​లో చిక్కుకున్న కోతిపిల్ల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో విద్యుదాఘాతానికి గురై.... ట్రాన్స్‌ఫార్మర్‌లో చిక్కుకున్న కోతిపిల్లను.... అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఇతర వానరాలు దాడి చేస్తున్నా.... ప్రతిఘటిస్తూ కోతిపిల్లను కాపాడారు.

Monkey: 'ట్రాన్స్​ఫార్మర్​లో చిక్కుకున్న కోతిపిల్ల... ఎలా బయటకుతీశారో చూడండి'

author img

By

Published : Sep 19, 2021, 10:37 AM IST

నిత్యం రోడ్ల మీద కోతులు కనిపిస్తూ ఉంటాయి. అవి కేరింతలు కొడుతూ.. అల్లరి చేస్తూ.. అందరినీ ఆట పట్టిస్తుంటాయి వానరాలు. అయితే ఓ వానరం అనుకోకుండా విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్​లో ఇరుక్కుపోయింది. అందులోనూ కోతి పిల్ల విద్యుదాఘాతానికి గురైంది. ఓవైపు ఆ వానరాన్ని రక్షించుకోవడానికి ఎన్నో కోతులు.. ఆరాటపడ్డాయి. కానీ ఏమి చేయలేని పరిస్థితి.

ఆ ఘటనను గమనించి స్థానిక ట్రాఫిక్​ పోలీస్​.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలికి చేరుకుని.. ట్రాన్స్‌ఫార్మర్‌లో చిక్కుకున్న కోతిపిల్లను.... రక్షించారు. ఇతర వానరాలు దాడి చేస్తున్నా.... ప్రతిఘటిస్తూ కోతిపిల్లను కాపాడారు. పశువైద్యశాలకు తరలించి... ప్రాథమిక చికిత్స అందించారు. కోతి పిల్ల ఆరోగ్య స్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు.

'ట్రాన్స్​ఫార్మర్​లో చిక్కుకున్న కోతిపిల్ల... ఎలా బయటకుతీశారో చూడండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.