హైదరాబాద్ కోఠిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్ చేపట్టింది. ప్రమాదం జరిగినపుడు ఏ విధంగా స్పందించాలనే విషయాలపై ఆస్పత్రి డాక్టర్లు, ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బందికి అధికారులు వివరించారు.
మంటలు వ్యాప్తి చెందుతున్నప్పుడు వాటిని అదుపు చేయడం, ఆసుపత్రిలో ఉన్న రోగులను ఏవిధంగా కాపాడాలి అనే అంశాలపై అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించింది. అప్రమత్తంగా ఉన్నప్పుడే ప్రమాదాలను నివారించవచ్చని అందుకోసమే ఈ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు అగ్ని మాపక అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి : 'జార్జ్‌రెడ్డి స్ఫూర్తితో ఉద్యమంలో మరింత ముందుకు'