దీపావళి పర్వదిన వేడుకలు (Precautions to celebrate diwali) ఘనంగా జరుపుకోవడానికి నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. చిన్నాపెద్ద అంతా కలిసి బాణాసంచా కాల్చుతూ తమ ఆనందాన్ని పొందుతారు. ఈ క్రమంలో దీపాలంకరణలతో నిర్వహించుకునే దీపావళి(Precautions to celebrate diwali)ని సంతోషంగా జరుపుకోవాలని.. విషాదాన్ని దరిదాపులకు రానివ్వొద్దని అంటున్నారు అగ్నిమాపక శాఖ అధికారులు. బాణాసంచా విక్రయించే దుకాణదారులు అన్ని రకాల అనుమతులు తీసుకోవాలని సూచించారు. దుకాణాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
అనుమతులుంటేనే..
బాణాసంచా విక్రయించే దుకాణదారులు తప్పనిసరిగా దుకాణాల్లో ఇసుక, నీటి బకెట్లతో పాటు అగ్నిమాపక పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు పేర్కొన్నారు. అన్ని అనుమతులు తీసుకోవాలని.. అక్రమంగా బాణాసంచా(Precautions to celebrate diwali) నిల్వచేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఊహించని విధంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే ఘటనాస్థలానికి వేగంగా చేరుకునేందుకు జంటనగరాల్లో 25 అగ్నిమాపక శకటాలను అందుబాటులో ఉంచనున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి
టపాసులు కాల్చుతున్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి(Precautions to celebrate diwali) వస్తుందని.. హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. ఇది కాస్తా పండుగ సంబరాన్ని దూరం చేస్తుందని పేర్కొన్నారు. తయారీదారు వివరాలున్న బాణసంచానే కొనుగోలు చేయాలని నిపుణులు సూచించారు. ఇంట్లో దీపాలు వెలిగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. గాలి వీస్తున్నప్పుడు రాకెట్లు వంటివి పైకి ఎగిరేవి కాల్చవద్దని.. కాల్చిన బాణాసంచా(Precautions to celebrate diwali)ను నీరు నింపిన బకెట్‌లో వేయాలని చెప్పారు. సంబురాలు చేసుకునే సమయంలో బకెట్ నిండా నీటిని, దుప్పట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రమాదాలు జరిగితే వీటి ద్వారా కొంతమేర అరికట్టవచ్చని చెప్పారు.
చిన్నారులకు తోడుంటూ
గాల్లోకి ఎగిరే వస్తువులు కాల్చేటప్పుడు చుట్టుపక్కల ఇళ్ల కిటికీలు, తలుపులు మూసి ఉన్నాయో లేదో చూసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారి (Precautions to celebrate diwali) మోహన్‌రావు సూచించారు. కళ్లకు ప్రమాదం జరగకుండా చూసుకోవాలని.. నూలు, ఖద్దరు బట్టలను మాత్రమే ధరించాలని పేర్కొన్నారు. వాహనాలు ఉన్న ప్రదేశాలు, ఇళ్లలో టపాసులు కాల్చకూడదని స్పష్టం చేశారు. ముఖ్యంగా చిన్నారులను దీపాలకు దూరంగా ఉండేటట్లు చూసుకోవాలని చెప్పారు. చిన్నపిల్లలు టపాసులు కాల్చడంలో పెద్ద వాళ్లు సహాయం చేయాలని.. గ్రీన్ క్రాకర్స్, సీడ్ క్రాకర్స్‌ను కాల్చడం ద్వారా శబ్ద, వాయు కాలుష్యాలకు దూరంగా ఉండవచ్చని సూచించారు.
వెలుగుల దీపావళి పండుగను సంతోషంగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే కాకుండా వాయు కాలుష్యం దరిచేరకుండా పరిమిత సంఖ్యలో.. నిర్దేశించిన సమయంలోనే టపాసులు కాల్చడం ద్వారా గ్రీన్ హైదరాబాద్.. పొల్యూషన్ సిటీగా మారకుండా మన వంతు కృషి అందించినట్లుగా ఉంటుంది.
ఇదీ చదవండి: ప్రేమపెళ్లి చేసుకున్నందుకు ఆ కుటుంబాన్ని ఊరి నుంచి వెలివేశారు..!