హైదరాబాద్ ముషీరాబాద్‌లోని నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు అంటుకుని ఓ కారు షోరూంలో దాదాపు ఏడు కార్లు దగ్ధమయ్యాయి. భారీ ఎత్తున మంటలు, పెద్దఎత్తున శబ్ధాలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు.
తప్పిన పెను ముప్పు...
మంటలు అంటుకున్న షోరూం పక్కనే ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ఉంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు వ్యాప్తి చెందకుండా పరిస్థితిని అదుపు చేయడం వల్ల పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి : ఘోర అగ్నిప్రమాదం... నాలుగు దుకాణాలు దగ్ధం