హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనకు ఏసీ షార్ట్ సర్క్యూటే కారణమని, ఏవరికి గాయాలు కాలేదని యాజమాన్యం తెలిపింది.
పాఠశాలలో అగ్నిప్రమాదం
By
Published : Feb 20, 2019, 10:41 PM IST
పాఠశాలలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. అశోక్‌నగర్ సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాల విజువల్ గది నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. స్కూల్‌కు సంబంధించిన కొన్ని రికార్డులు కాలిపోయాయని, ఎవరికి గాయాలు కాలేదని యాజమాన్యం తెలిపింది. పాఠశాలలో ఎదుట ఓయూ జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. యాజమాన్యం అగ్నిమాపక ప్రమాణాలు పాటించలేదని జేఏసీ అధ్యక్షుడు శ్రీకాంత్ ఆరోపించారు.