ETV Bharat / state

మల్లాపూర్​ పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం.. అదుపులోకి వచ్చిన మంటలు - మల్లాపూర్​లో అగ్ని ప్రమాదం

fire
fire
author img

By

Published : Apr 12, 2023, 4:54 PM IST

Updated : Apr 12, 2023, 7:47 PM IST

16:49 April 12

మల్లాపూర్​ పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం

Fire Accident In Hyderabad: హైదరాబాద్​ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. సికింద్రాబాద్ అగ్ని ప్రమాద​ ఘటన జరిగిన విషయాన్ని మరిచిపోక ముందే.. ఆ తర్వాత స్వప్నలోక్​ కాంప్లెక్స్​లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ రెండు ఘటనల్లో సుమారు 8 మంది మృతి చెందారు. అయితే తాజాగా మళ్లీ మరో భారీ అగ్ని ప్రమాదం.. మల్లాపూర్​ పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం పెయింటింగ్​ రసాయన పరిశ్రమలో జరగడంతో.. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి.

ఈ మంటల ఉద్ధృతికి ఆ పారిశ్రామికవాడ పక్కనే ఉన్న బాబానగర్​ కాలనీ వాసులు భయంతో బయటకు పరుగులు తీశారు. పొగలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే స్థానికులు నాచారం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది ఫైర్​ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 11 అగ్ని మాపక శకటాలతో మంటలను అగ్నిమాపక శాఖ, జీహెచ్​ఎంసీ టీఆర్​ఎస్​ బృందం అదుపులోకి తీసుకువచ్చింది. ఇంకా ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ప్రాణ, ఆస్తి నష్టం ఏమైనా సంభవించాయా అనే అంశంపై పూర్తి సమాచారం లేదు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 12, 2023, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.