ETV Bharat / state

Fire accident in Hyderabad : ఇంట్లో మంటలు అంటుకొని వ్యక్తి మృతి.. ప్రమాదమా.. ఆత్మహత్యా..?

Fire accident in Hyderabad : హైదరాబాద్​లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

fire accident in hyderabad
హైదరాబాద్​లో అగ్ని ప్రమాదం.. ఓ వ్యక్తి మృతి..
author img

By

Published : May 10, 2023, 7:21 PM IST

Fire accident in Hyderabad : హైదరాబాద్​లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి కమల ప్రసన్న నగర్​లో ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నివాసముండే జయకృష్ణ(32) మరణించాడు. యువకుడి ఇంట్లో నుంచి మంటలు చెలరేగడం చూసి అక్కడి స్థానికులు ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం ఎలా జరిగింది అని వివరాలు తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ జరిగింది: స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. జయకృష్ణ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్​లోని భీమవరానికి చెందిన వ్యక్తి. గత ఆరు నెలలుగా హైదరాబాద్​లో నివాసం ఉంటున్నాడు. నాలుగు నెలలుగా స్థానికంగా జిమ్ ట్రైనర్​గా పని చేస్తున్నాడు. తన భార్య, పిల్లలను తన సొంత ప్రాంతమైన భీమవరంలో ఉంచాడు. ప్రస్తుతం ఇంకో వ్యక్తితో పాటు రూమ్​లో ఉంటున్నాడు. తనతో పాటు ఉన్న సదరు వ్యక్తి పని నిమిత్తం బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మొదటి అంతస్తులోని జయకృష్ణ గది నుంచి మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను చూసి పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ డిపార్డ్​మెంట్​కు సమాచారం అందించి మంటలను ఆర్పేశారు. లోపలికి వెళ్లి చూసే సరికి జయకృష్ణ మంటల్లో కాలి మృతిచెందాడు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. మృతుడు అధికంగా మద్యం సేవించే వాడని అతని బంధువులు తెలిపారు. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడా లేక అగ్నిప్రమాదం వల్ల ఇలా జరిగిందా అనే విషయాలు దర్యాప్తులో తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

"సుమారు ఒకటిన్నర గంటల సమయంలో కమల ప్రసన్న నగర్​లో ఫైర్ ఆక్సిడెంట్ జరుగుతున్నట్లు ఫోన్ వచ్చింది. మేము వచ్చి ఫైర్ సిబ్బందిని పిలిచాం. మొదటి అంతస్తులో ఈ ఆక్సిడెంట్ జరిగింది. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పేశారు. లోపల ఒక వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గుర్తించాం. బెడ్​ రూమ్​లో ఈ ప్రమాదం జరిగింది. ఇది ప్రమాదమా లేదా సూసైడ్ చేసుకున్నాడా అనేది దర్యాప్తు పూర్తయ్యాక చెబుతాం. గత ఆరు నెలలగా మృతడి కుటుంబం ఇక్కడ నివసిస్తోంది. భార్య, పిల్లలను వారి సొంత ప్రాంతమైనా భీమవరంలో ఉంచాడు. రూమ్ షిప్ట్ అవ్వాలనుకున్నారు. ప్రస్తుతం రూమ్​లో మృతుడు, మరో వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి పని నిమిత్తం బయటకెళ్లాడు. అంతలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది."_పోలీస్ అధికారి

హైదరాబాద్​లో అగ్ని ప్రమాదం.. ఓ వ్యక్తి మృతి..

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.