ETV Bharat / state

చోరీకి గురైన బస్సు ఎక్కడుందో కనుక్కోండి..?

హైదరాబాద్​ సెంట్రల్​ బస్​ స్టేషన్​లో చోరీకి గురైన ఆర్టీసీ బస్సు ఎక్కడుందో గుర్తించాలని రవాణ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి ఇవాళ సీపీ అంజనీకుమార్​ను ఆదేశించారు. ఆర్టీసీ అధికారులతో సమీక్షించిన మంత్రి రాష్ట్రవ్యాప్తంగా బస్​స్టేషన్లలో భద్రతా లోపాలను గుర్తించి సరిచేయాలని ఆదేశించారు.

author img

By

Published : Apr 25, 2019, 6:39 PM IST

బస్సు ఎక్కడుందో కనుక్కోండి

హైదరాబాద్​లోని కుషాయిగూడ డిపోకు చెందిన మెట్రో ఎక్స్​ప్రెస్​ బస్సు చోరీ ఘటనపై రవాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 24న సెంట్రల్​​ బస్​ స్టేషన్​లో ఏపీ 11 జడ్​ 6254 సంఖ్య గల బస్సు చోరీకి గురైంది. ఈ వ్యవహారంపై ఆర్టీసీ కార్యనిర్వహణ విభాగం ఈడీ రవీందర్​, జీహెచ్​జడ్​ విభాగం ఈడీ వినోద్​కుమార్​, సికింద్రాబాద్​, హైదరాబాద్​ ప్రాంతీయ మేనేజర్లు, ఇతర అధికారులతో మంత్రి సమీక్షించారు. ఆర్టీసీ తరఫున జాతీయ రహదారుల పెట్రోలింగ్​ బృందాలకు సమాచారమిచ్చినట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు.

బస్సు ఎక్కడుందో వెంటనే గుర్తించాలని సీపీ అంజనీకుమార్​కు ఫోన్​లోనే ఆదేశాలు జారీచేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బస్​స్టేషన్లలో భద్రతా లోపాలను గుర్తించి సరిచేయాలని అధికారులను ఆదేశించారు.

బస్సు ఎక్కడుందో కనుక్కోండి

ఇవీ చూడండి: లారీ డ్రైవర్ బ్రేకేశాడు..ఆర్టీసీ డ్రైవర్ ఢీకొట్టాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.