ETV Bharat / state

GHMC: జీహెచ్​ఎంసీని వెంటాడుతున్న ఆర్థిక కష్టాలు.. నత్తనడకన సాగుతున్న పనులు - telangana varthalu

జంటనగరాల్లో నిధుల కొరత కారణంగా అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. గత కొంతకాలంగా కరోనాతో ఆగిపోయిన పనులు తాజాగా బిల్లులు అందక ఆగిపోయాయి. మూడేళ్ల కిందట ఎస్సార్డీపీ కింద చేపట్టిన పన్నెండు పెద్ద ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. నిధుల సమీకరణలో జీహెచ్ఎంసీ తలమునకలవుతుండగా, కూలీలకు ఇచ్చేందుకు కూడా డబ్బులు రాక పనులు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.

GHMC: జీహెచ్​ఎంసీని వెంటాడుతున్న ఆర్థిక కష్టాలు.. నత్తనడకన సాగుతున్న పనులు

author img

By

Published : Aug 20, 2021, 7:04 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్​ను ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. నిధులు లేక పనులు నిలిచిపోయే దుస్థితికి వచ్చింది. ఖజానా ఖాళీ అవడంతో జీహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురుచూస్తోంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్​మెంట్ ప్లాన్ కింద మూడేళ్ల క్రితం చేపట్టిన పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో ప్లై ఓవర్, అండర్ పాస్​ల నిర్మాణ ప్రాంతాల్లో వాహనదారులకు ట్రాఫిక్ జామ్ తప్పడం లేదు. శిల్పా లేఔట్‌ నుంచి గచ్చిబౌలి వరకు 330 కోట్ల రూపాయలతో చేపట్టిన ఫ్లై ఓవర్‌ నిర్మాణం మధ్యలోనే ఉంది. పనులు జరగాలా వద్దా అన్నట్లు సాగుతున్నాయి. 175 కోట్ల రూపాయలతో రేతిబౌలి, నానల్‌నగర్‌ జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ నిర్మాణాలను బల్దియా చేపడుతోంది. నిధుల కొరతతో ఈ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి.

నిధులు అందక..

ఆరాంఘర్‌ నుంచి జూపార్క్‌ వరకు ఫ్లై ఓవర్‌ కోసం 326 కోట్లు, చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌ పొడిగింపు 30 కోట్లతో చేపట్టగా బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు పనులు పనులు నిలిపివేశారు. 426 కోట్ల రూపాయలతో ఇందిరా పార్కు-వీఎస్టీ స్టీల్‌బ్రిడ్జి నిర్మాణం చేపట్టగా అది ఇంతవరకు పూర్తి కాలేదు. 526 కోట్లతో నల్గొండ క్రాస్‌రోడ్‌ - ఒవైసీ జంక్షన్‌ ఫ్లై ఓవర్‌, 300 కోట్ల రూపాయలతో ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ కొనసాగింపు, గ్రేడ్‌ సెపరేటర్ల నిర్మాణం చేపట్టారు. కొంతకాలంగా బల్దియాలో ఆర్థిక ఇబ్బందులతో సివిల్ కాంట్రాక్టర్లకు నిధులు అందక పనులు జరిపే పరిస్థితి లేకుండా పోయింది.

సేకరించారిలా..

జీహెచ్ఎంసీ ఏడాది బడ్జెట్ రూ. 6 వేల కోట్లలోపు ఉన్నప్పటికీ ఆ సంస్థ అప్పులు రూ.5 వేల కోట్లకు చేరుకున్నాయి. ఎస్సార్డీపీలో భాగంగా చేపట్టిన ఫ్లైఓవర్లు, అండర్ పాస్​ల నిర్మాణానికి బ్యాంకుల నుంచి రూ. 2,500 కోట్ల రుణాలు తీసుకున్నారు. బాండ్ల ద్వారా 700 కోట్ల నిధులు సేకరించారు. మరో రూ.300 కోట్లు బాండ్ల ద్వారా సేకరించాల్సి ఉంది. గ్రేటర్​లోని 709 కిలోమీటర్ల ప్రధాన రోడ్లను ఐదేళ్ల పాటు నిర్వహణ కోసం రూ.1,827 కోట్లకు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. వీటి కోసం రూ.1,460 కోట్లు బ్యాంకు రుణాల ద్వారా సేకరించారు. రూ.9 వేల 500 కోట్లతో గ్రేటర్​లో లక్ష డబుల్ బెడ్​రూం ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. వాటిలో సగానికి పైగా నిర్మాణం పూర్తి కాగా మిగిలినవి పూర్తి కావడానికి మరో 3,500 కోట్ల రూపాయలు కావాల్సి ఉంది.

ఆదాయానికి మించి..

ఇలా జీహెచ్ఎంసీకి ఆదాయానికి మించి వ్యయభారంతో అప్పులో ఊబిలో కూరుకుపోవాల్సి వచ్చింది. ఏడు నెలలుగా సివిల్ కాంట్రాక్టర్లకు బిల్లులు అందలేదని ఆందోళన చేస్తుండగా.. ఇప్పటికే ఫిబ్రవరి నాటి వరకు జరిగిన పనులకు బిల్లులు చెల్లించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఆ ప్రక్రియ కూడా పూర్తైంది. కాంట్రాక్టర్లు బిల్లుల కోసం సమ్మె చేస్తున్నట్లు గత నెల ప్రకటించినా అడపదడపా పనులు జరుగుతూనే వచ్చాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మార్చి వరకు చేసిన బిల్లులకు సంబంధించి పెండింగ్​లో ఉన్న 400 కోట్లు విడుదల చేసేందుకు హామీ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఇంకా ఎన్నో బిల్లులు పెండింగ్​లో ఉన్నట్లు కాంట్రాక్టర్లు వాపోతున్నారు.

ఇదీ చదవండి: Kishan Reddy: ఎన్ని లక్షల కోట్లు ఖర్చైనా అందరికి టీకా ఇచ్చి తీరుతాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.