ఈ నెల 17న ఎంసెట్ బైపీసీ విద్యార్థులకు తుది విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 17, 18 తేదీల్లో ఆన్లైన్లో ప్రాసెసింగ్ రుసుము చెల్లించి.. ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈనెల 17 నుంచి 19 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. 17 నుంచి 20 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఉంటుంది. 21న ఎంసెట్ బైపీసీ అభ్యర్థులకు తుది విడత సీట్లు కేటాయిస్తారు. 21 నుంచి 26 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి... 22 నుంచి 26 వరకు కాలేజీల్లో చేరాలని కన్వీనర్ నవీన్ మిత్తల్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: హీరో నాగశౌర్యకు రూ.500 జరిమానా