ETV Bharat / state

'సమాజ హితం కోసం పోరాడేవారే ధన్యజీవి' - సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి

నిరాశ, నిస్పృహలకు స్వస్తిపలికి సమాజ హితం కోసం పోరాడేవారే ధన్యజీవులని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్​లోని తాజ్ మహల్ హోటల్​లో 'అమ్మ నాన్న అనాధ ఆశ్రమం' లోగో, వెబ్ సైట్​ను ఆయన ఆవిష్కరించారు. ఈ సంస్థ ద్వారా‌ గట్టుశంకర్ అందిస్తున్న సేవలు వెలకట్టలేవని అన్నారు.

amma nanna orphanage
అమ్మ నాన్న అనాధ ఆశ్రమం
author img

By

Published : Dec 28, 2020, 8:10 AM IST

Updated : Dec 28, 2020, 8:51 AM IST

నేటి యువతరం నిరాశ, నిస్పృహలకు స్వస్తి పలికి సమాజ చైతన్యం కోసం పోరాడాలని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. పెడదారి పడుతున్న సమాజానికి చేయూతనిచ్చేందుకు మంచి మనసున్న మనుషులు అవసరమని తెలిపారు. అలాంటి వారే ధన్యజీవులని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్​లోని తాజ్ మహల్ హోటల్​లో 'అమ్మ నాన్న అనాధ ఆశ్రమం' లోగో, వెబ్ సైట్​ను ఆయన ఆవిష్కరించారు. ఈ సంస్థ ద్వారా‌ గట్టు శంకర్ చేస్తున్న సేవలు వెలకట్టలేవని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీ కృష్ణారెడ్డితో పాటు అచ్చిరెడ్డి, ప్రముఖ డిజైనర్‌ శశి వంగపల్లి, విన్ను సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. నలుగురు సభ్యులు ఉన్న కుటుంబ పోషణకే నానా‌ ఇబ్బందులు పడే ఈ రోజుల్లో నాలుగు వందల మంది అభాగ్యులకు ఆశ్రయం కల్పించడం గొప్ప విషయమని సినీ నిర్మాత అచ్చిరెడ్డి అన్నారు.

ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తన నిజజీవితంలో ఎదురైన కష్టాల అనుభవంతో ఆశ్రమం నిర్వాహించాలనే లక్ష్యం పెట్టుకున్నానని అనాథ ఆశ్రమం నిర్వాహకులు గట్టు శంకర్ అన్నారు. ఒక్కరితో మొదలై ఇపుడు అనేక మందికి ఆశ్రయం కల్పిస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి: నేటి నుంచి రైతుబంధు... నియంత్రిత సాగుపై కీలక నిర్ణయాలు

Last Updated : Dec 28, 2020, 8:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.