రాష్ట్రంలో మండల, జిల్లా ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడతలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మూడో విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. చివరి దశలో 161 జెడ్పీటీసీ, 1738 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇవాళ రిటర్నింగ్ అధికారులు నోటీసు జారీ చేయనున్నారు.
మూడో విడత ఎన్నికల ప్రక్రియ
ఈరోజు నుంచి మూడు రోజుల పాటు నామపత్రాలు స్వీకరిస్తారు. మొదటి విడత ఎన్నికలు జరిగే స్థానాలకు వచ్చే నెల ఆరో తేదీన పోలింగ్ జరగనుంది. ఆయా స్థానాల్లో ప్రచారపర్వం ప్రారంభమైంది. పార్టీలు, అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల తరపున ఆయా పార్టీల ముఖ్యనేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
పోలింగ్ అధికారులకు శిక్షణ
పోలింగ్ తేదీ సమీపిస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను వేగవంతం చేసింది. బ్యాలెట్ పత్రాల ముద్రణ, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయడం సహా పోలింగ్ సామాగ్రి సమీకరణ తదితర కసరత్తు కొనసాగుతోంది. ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులకు శిక్షణా ప్రక్రియ కొనసాగుతోంది. ఎంపీటీసీ ఎన్నికల అభ్యర్థుల కోసం మరో 25 అదనపు గుర్తులను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. కొన్ని స్థానాల్లో అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండవచ్చన్న సమాచారం నేపథ్యంలో అదనపు గుర్తులను సమకూర్చారు.
ఇవీ చూడండి: ఇంటర్ తప్పులకు కారణమైన అధికారులను తొలగించాలి