ETV Bharat / state

అంబర్‌ పేట నియోజకవర్గంలో 50 కొవిడ్‌ కేసులు

హైదరాబాద్‌ అంబర్‌ పేట నియోజకవర్గంలో కొవిడ్ విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే 50 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఐదుగురు కానిస్టేబుళ్లు, చిన్నారులు కూడా ఉన్నారు. కాచిగూడలోని 69 ఏళ్ల వృద్ధురాలు కరోనా చికిత్స పొందుతూ గాంధీ ఆస్పత్రిలో మృతి చెందింది.

అంబర్‌ పేట నియోజకవర్గంలో 50 కొవిడ్‌ కేసులు
అంబర్‌ పేట నియోజకవర్గంలో 50 కొవిడ్‌ కేసులు
author img

By

Published : Jul 3, 2020, 10:06 PM IST

హైదరాబాద్‌ అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. శుక్రవారం ఒక్క రోజే 50 కేసులు నమోదయ్యాయి. అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట పరిధిలోని 3డివిజన్లలో ఈ కేసులు తేలాయి. కాచిగూడలోని 69 ఏళ్ల వృద్ధురాలు కరోనా చికిత్స పొందుతూ గాంధీ ఆస్పత్రిలో మృతి చెందింది.

శుక్రవారం అంబర్ పేట డివిజన్ పరిధి నుంచి 22, కాచిగూడ డివిజన్ పరిధిలో 16, నల్లకుంట డివిజన్‌ పరిధిలో 12 కేసులు నమోదయ్యాయి. అంబర్‌ పేట పోలీస్ క్వార్టర్స్‌లో ఉండే ముగ్గురు కానిస్టేబుల్స్‌కి వైరస్‌ నిర్ధరణ అయింది.

అంతేకాకుండా అంబర్‌ పేటలో నివాసముండే అమీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు ఎక్సైజ్ కానిస్టేబుళ్లకి కూడా మహమ్మారి సోకింది. తిరుమల నగర్‌లోని ఒక కుటుంబంలో ఇద్దరు చిన్నారులకు(ఒక సంవత్సరం బాబు, ఏడేళ్ల పాప), మరో కుటుంబంలో 60 ఏళ్ల వృద్ధురాలికి, రెండేళ్ల చిన్నారికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది.

ఇదీ చూడండి:ప్రధాన కార్యదర్శితో సహా 100 మంది ఐఏఎస్​ల బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.