హైదరాబాద్‌లో ఫీవర్ సర్వే కొనసాగుతోంది. వైద్య, ఆరోగ్య శాఖలకు చెందిన 709 బృందాలు... ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూమ్‌కు.... మహమ్మారికి సంబంధించి వచ్చిన ఫోన్లకు అధికారులు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
మెదక్ జిల్లాలోనూ ఫీవర్ సర్వే కొనసాగుతోంది. సర్వేను సమగ్రంగా నిర్వహించాలని కలెక్టర్ హరీశ్... వైద్యాధికారులకు సూచించారు. సర్వే తీరును ఆయన పరిశీలించారు.
ఇదీ చూడండి: అంబులెన్సులను ప్రభుత్వం ఏ రకంగానూ అడ్డుకోవద్దు: హైకోర్టు