ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి ఫీవర్​ సర్వే.. లక్షణాలుంటే కిట్స్​.. - ఫీవర్‌ సర్వే

Fever Survey: కొవిడ్‌ కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టిన ఫీవర్‌ సర్వే రాష్ట్రవ్యాప్తంగా మొదలైంది. తొలిరోజు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారికి వెంటనే మెడికల్‌ కిట్‌ అందించారు. ఫీవర్‌ సర్వేను పలు చోట్ల సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, కలెక్టర్లు పర్యవేక్షించారు. వారంలో జ్వర సర్వే పూర్తిచేసేలా చర్యలు చేపట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి ఫీవర్​ సర్వే.. లక్షణాలుంటే కరోనా కిట్స్​..

author img

By

Published : Jan 21, 2022, 7:40 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి ఫీవర్​ సర్వే.. లక్షణాలుంటే కిట్స్​..

Fever Survey: రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే ప్రారంభమైంది. వైద్యబృందాలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను లక్షణాలు అడిగి తెలుసుకుంటున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉన్నాయా అని ఆరా తీసి... వెంటనే మెడికల్‌ కిట్లు అందిస్తున్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లో జరుగుతున్న ఫీవర్ సర్వేను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పరిశీలించారు. జ్వరం లేదా ఇతర కొవిడ్‌ లక్షణాలు ఉంటే అక్కడిక్కడే మెడిసిన్ కిట్‌ అందిస్తున్నట్లు సోమేశ్‌కుమార్‌ చెప్పారు. వారంలో రాష్ట్రంలో ఫీవర్ సర్వే పూర్తిచేస్తామని స్పష్టంచేశారు.

ఒక వారం రోజుల్లో ఫీవర్ సర్వే పూర్తి చేస్తాం. దీనివల్ల వ్యాక్సినేషన్​ గురించి కూడా వివరాలు సేకరిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ ఫీవర్​ సర్వేకు సహకరించాలి. కొవిడ్‌ లక్షణాలుంటే 5 రోజుల మందుల కిట్‌ అందజేస్తాం. కోటి మందుల కిట్‌లు సిద్ధంగా ఉంచాం. త్వరలో కేసులు తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నాం. -సోమేశ్​కుమార్​, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

సర్వే వేగంగా చేయాలి..

Fever Survey in Telangana: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఫీవర్‌ సర్వేను హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ పరిశీలించారు. సర్వే వేగంగా చేయాలని ఆరోగ్య కార్యకర్తలకు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్‌ వ్యాప్తంగా 840 బృందాలు ఫీవర్ సర్వే చేస్తున్నాయని హైదరాబాద్ డీఎంహెచ్ఓ వెంకట్ వెల్లడించారు. ప్రతి బృందం రోజుకి 60 ఇళ్లను సర్వే చేస్తాయని చెప్పారు.

జిల్లాల్లో జ్వర సర్వే ముమ్మరం

ఆదిలాబాద్‌లోని పురపాలక అధికారులు, ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ప్రజల్ని కొవిడ్‌ లక్షణాలను అడిగి తెలుసుకున్నారు. సర్వేను ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షించారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఫీవర్‌ సర్వేను కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జ్వర సర్వే ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. హన్మకొండ ఇందిరాకాలనీలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఇంటింటికి తిరుగుతూ సర్వే చేపట్టారు. 2 లక్షల 2 వేల 542 ఇళ్లలో సర్వే చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ బయటికి వెళ్లినప్పుడు మాస్క్‌ ధరించాలని కలెక్టర్‌ సూచించారు. ఇదే సమయంలో వ్యాక్సిన్ తీసుకోనివారిని గుర్తించి టీకా ఇస్తున్నారు.

మెడికల్​ కిట్స్​ సిద్ధం

ప్రభుత్వానికి మెడికల్‌ కిట్స్‌ అందించేందుకు టెండర్లు దక్కించుకున్న సంస్థలు కిట్ల ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. సుల్తాన్ బజార్‌, విక్టోరియా గ్రౌండ్స్‌లో వేలాదిగా కిట్లు సిద్ధం చేసి వైద్యారోగ్యశాఖకు అందిస్తున్నారు. 8 రకాల మందులతోపాటు వాటి వినియోగానికి సంబంధించిన వివరాలతో కూడిన పాంప్లెట్‌ను జతచేస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.