జీహెచ్ఎంసీ పరిధిలో ఇంటింటికి ఫీవర్ సర్వే విస్తృతంగా జరుగుతోంది. జీహెచ్‌ఎంసీ వైద్య, ఆరోగ్యశాఖలకు చెందిన 700బృందాలు ఇంటింటికీ తిరిగి జ్వరం, కొవిడ్ లక్షణాలున్న వారి పేర్లను నమోదు చేసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో యాంటీ లార్వా ద్రావణాన్ని పిచికారీ చేపిస్తారు.
నగరంలోని ప్రతి బస్తీ దవాఖాన, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇతర దవాఖానాల్లో కొవిడ్ అవుట్ రోగులకు పరీక్షలు నిర్వహించింది. సర్కారు సూచనలతో అన్ని ఆస్పత్రుల్లో 18,765 మందికి జ్వర పరీక్షలు నిర్వహించారు. కాగా జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ ద్వారా 130 మందికి కొవిడ్ సంబంధిత సలహాలు, సూచనలు వైద్యులు అందజేశారు.
ఇదీ చూడండి: కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష